షారుఖ్ మారాడు.. ఇదిగో రుజువు

షారుఖ్ మారాడు.. ఇదిగో రుజువు

ఒకప్పుడు షారుఖ్ ఖాన్ రేంజే అంటో అతడి అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడికి బాలీవుడ్ బాద్‌షా అని.. కింగ్ ఖాన్ అని బిరుదులు ఊరికే వచ్చేయలేదు. అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకుని కొన్నేళ్ల పాటు బాలీవుడ్లో తిరుగులేని హవా సాగించాడతను. కానీ ట్రెండుకు తగ్గట్లు మారలేక.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేయక రేసులో వెనకబడిపోయాడు. ప్రేక్షకుల్ని తక్కువగా అంచనా వేస్తూ మైండ్ లెస్ కమర్షియల్ సినిమాలు చేసి బాగా దెబ్బ తిన్నాడు షారుఖ్. గత ఏడాది ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ సినిమా ఫలితం చూస్తే.. షారుఖ్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ అర్థమైంది.

దీంతో ఇక తాను మారాల్సిన అవసరముందని అతను గట్టిగానే నిర్ణయించుకున్నాడు. ఎప్పుడూ హీరోయిజం కోసం వెంపర్లాడే షారుఖ్.. మరగుజ్జు పాత్రలో చేయడానికి సిద్ధపడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న ‘జీరో’లో అతడిది మరగుజ్జు పాత్రే. దీని తర్వాత కూడా ఒక ప్రయోగాత్మక సినిమా చేయడానికి షారుఖ్ ఓకే చెప్పినట్లు సమాచారం. చంద్రమండలంపైకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథతో తెరకెక్కబోయే బయోపిక్‌లో షారుఖ్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ చిత్రం నిజానికి అమీర్ ఖాన్ చేయాల్సింది. కానీ వేరే కమిట్మెంట్ల వల్ల తప్పుకున్నాడు. అమీర్ వదిలేసిన సినిమాను నేను చేయడమేంటి అని అహం చూపించకుండా షారుఖ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించడం అతడిలో మార్పుకు సూచిక. పైగా ఒక వ్యోమగామి బయోపిక్‌లో నటించడానికి షారుఖ్ ఒప్పుకోవడమూ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ మార్పు అతడి మంచికే అంటున్నారు బాలీవుడ్ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English