నాగ్-వర్మ.. జనాలకు కామెడీగా ఉంది

నాగ్-వర్మ.. జనాలకు కామెడీగా ఉంది

రామ్ గోపాల్ వర్మ నుంచి ఒక మంచి సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి చాలా ఏళ్ల కిందటే వచ్చేసింది. గత దశాబ్దంలో వర్మ ఎన్నెన్ని చెత్త సినిమాలు చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడితో సినిమా చేయడానికి నాగార్జున ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే నాగ్.. తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేస్తాడులే, ఏదో ప్రత్యేకత లేకుండా వర్మ సినిమా ఎందుకు ఒప్పుకుంటాడులే అని సమాధాన పడిన వాళ్లూ ఉన్నారు. అయినప్పటికీ మెజారిటీ ప్రేక్షకులకు వర్మ-నాగ్ సినిమా మీద నమ్మకాలు తక్కువే. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రోమోలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

కానీ అటు వర్మ.. ఇటు నాగ్ మాత్రం సినిమా భలేగా వచ్చేస్తోందని చెప్పుకుంటూ అప్పుడప్పుడూ ఆన్ లొకేషన్ పిక్స్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నాగ్ ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక పిక్ పెట్టి ‘‘ఆఫీసర్ సినిమా చిత్రీకరణ 90 శఆతం పూర్తయింది. ఇప్పటిదాకా షూట్ చేసిన సన్నివేశాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి. సినిమా పూర్తి కావచ్చేసరికి వర్మను, చిత్ర బృందాన్ని మిస్సవుతున్నాను’’ అని ట్వీట్ పెట్టాడు. దీనికి బదులుగా వర్మ కూడా ఏమీ తగ్గలేదు. ‘‘నాగార్జునా.. మీరు మమ్మల్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. కానీ ఆ బాధను దిగమింగుకుని సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాం’’ అంటూ ఒక ఫొటోతో పాటు ట్వీట్ పెట్టాడు. ఐతే జనాలకు మాత్రం ఈ ట్వీట్లు కామెడీగా అనిపిస్తున్నాయి. వర్మ సినిమాలో సీన్లు నాగార్జునకు మరీ అంత ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయా.. నాగార్జునను మిస్సవుతున్నందుకు వర్మ ఫీలైపోతున్నాడా అని వెటకారాలాడేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English