స‌మంత రిలీఫ్‌ ఇచ్చేసిందమ్మా

స‌మంత రిలీఫ్‌ ఇచ్చేసిందమ్మా

రంగ‌స్థ‌లంలో స‌మంత‌ను చూసి చాలామంది సమంతను ఆకాశానికి ఎత్తేస్తే.. కొందరు అభిమానులు మాత్రం తెగ ఫీలైపోయారు. డీ గ్లామ‌ర్ ఫోజులు ఫొటోలు ఎన్నిరోజులు చూడాలా అని వాపోయారు. అసలు గ్లామర్ కే కేరాఫ్‌ అడ్రస్ అయిన సమంతను ఇలా చూపిస్తారా అంటూ వారు రంగమ్మ మంగమ్మ సాంగ్ ఫోటోస్ చూశాక ఇంకా హర్టయ్యారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఆ టైపు అభిమానుల కోసం ఓ స్టైలిష్ లుక్ విసిరిందీ సుందరి. ట్రెండీ డ్రెస్‌తో అదిరిపోయింది. పదండి చూద్దాం.

రంగ‌స్థ‌లంలో డీగ్లామ‌ర్ పాత్ర చేసింది స‌మంత‌. బాగా మాసిపోయిన లంగా వోణీలు... ఆమెప‌క్క‌న న‌డుస్తున్న బ‌ర్రెలు... డొక్కు సైకిలు.. ఇవ‌న్నీ చూసి సామ్ అభిమానులు మొద‌ట్లో కొత్త‌గా భావించారు. కానీ కొన్ని రోజులుగా ఆమె డీ గ్లామ‌ర్ ఫోటోలే నెట్‌లో సంద‌డి చేస్తున్నాయ్‌. దీంతో గ్లామ‌ర‌సం ఉట్టిపడే లుక్ కోసం త‌పించిపోయారు. వారి దాహం తీర్చేందుకా అన్న‌ట్టు సామ్ సూప‌ర్ ఫోజును పోస్టు చేసింది. అనంత‌పురంలో ఓ మొబైల్‌ షాపు ఓపెనింగ్ కు వెళ్లేందుకు ఇలా హాటుగా రెడీ అయ్యిందట. స్క‌ర్ట్‌... పైన ష‌ర్టు... కోటుతో మంచి అవుట్ ఫిట్ వేసింది. ట్రెండీ చెవి పోగుల‌తో అదిరే హెయిర్ స్టైల్‌తో అభిమానుల‌ను కవ్వించేసరికి వారి గుండెలు ఝ‌ల్లుమ‌న్నాయి. సమంత రిలీఫ్‌ ఇచ్చేసిందంటూ వారు సమ్మర్లో వెన్నెలను చూసినట్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఆమెను చూసేందుకు అభిమానులు పొటెత్తారు. ఓ అభిమాని పోలీసుల చేత దెబ్బ‌లు కూడా తిన్నాడు. ఆ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న స‌మంత అక్క‌ణ్నించి త్వ‌ర‌త్వ‌ర‌గా వెళ్లిపోయింది. ఈ అమ్మ‌డు న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రం మార్చి 30న విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతుంది. స‌మంత ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు