చాలా సీక్రెట్స్ చెప్పేసిన తమన్నా

చాలా సీక్రెట్స్ చెప్పేసిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఇప్పుడు కాసింత స్లో అయినట్లుగా కనిపిస్తుంది కానీ.. ఈ భామ ఒక్కసారి కానీ ఫాంలోకి వచ్చిందంటే పట్టుకోవడం ఎవరికైనా కష్టమే. ఒక ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. ఇండియాలోని ప్రధానమైన అన్ని ఫిలిం ఇండస్ట్రీలలోనూ తగినంతగా గుర్తింపు పొందిన మిల్కీకి.. బౌన్స్ బ్యాక్ అవడం కష్టం కాకపోవచ్చు.

ఈ సుందరి గురించి జనాలకు బాగానే తెలిసినా.. సెలబ్రిటీలు తమ గురించి పలు సంగతులను కొత్తగా బయటపెడుతూనే ఉంటారు. కాకపోతే.. ప్రశ్నలు అడిగి వాటిని రాబట్టడమే అసలు సమస్య. 10 నిమిషాలు మాత్రమే టైం ఉంటే.. షార్ట్ డ్రెస్- స్నీకర్స్ తో రెడీ అయిపోతుందట తమన్నా. మెజెంటా తనకు నచ్చని కలర్ అంటున్న తమ్మూ.. పిజ్జాపై పెపరోని టాపింగ్ ను ఇష్టపడుతుందట. వయసు పెరుగుతున్న కొద్దీ భోజనం తగ్గించుకోవడం కారణంగా ఎక్కువగా తిట్లు తిన్నానని అంటున్న తమన్నా.. తాను పెద్ద ఫుడీ అని గర్వంగా చెబుతోంది.

తనలో సెక్సీ థింగ్ తన కళ్లే అంటున్న తమన్నా.. మగవాళ్లలో సెన్సాఫ్ హ్యూమర్ ను తెగ మెచ్చుతుందట. తనకు రైటింగ్ అనేది ఒక సీక్రెట్ హాబీ అని చాలామందికి చెప్పదు మిల్కీ బ్యూటీ. తనకు ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ అంటే హృతిక్ రోషన్ అని తడుముకోకుండా సమాధానం ఇచ్చేస్తోంది. దిండును కౌగిలించుకుని స్టార్ ఫిష్ మాదిరిగా నిద్రపోవడం ఇష్టమట. రాక్ బేబీ రాక్ ఎప్పుడు చూసినా ఏడుపు వస్తుందన్న తమన్నా.. హెరాఫెరీ చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే  విపరీతంగా నవ్వుతుందట. తనకు 8 నెంబర్ చెడు చేస్తుందని విపరీతంగా నమ్ముతుందట మిల్కీ బ్యూటీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు