ఆ టెర్రరిస్టు మీద సినిమానా?

ఆ టెర్రరిస్టు మీద సినిమానా?

అహ్మద్ ఒమర్ సయీద్ షేక్.. ప్రస్తుతం పాకిస్తాన్ లోని లాహోర్ జైల్లో మగ్గుతున్న ఈ టెర్రరిస్ట్ గురించి అందరికీ తెలుసు. లండన్ లో పుట్టిన పాకిస్తాన్ సంతతి వ్యక్తి.. అక్కడకు వచ్చిన భారతీయ టూరిస్టులను కిడ్నాప్ చేయడం.. మర్డర్ చేయడం వంటి కేసులలో నిందితుడు. ఇతడిని ఇండియాలో అరెస్ట్ చేసినా.. ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేసినపుడు (హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారుగా).. ఇతడిని విడుదల చేయాల్సి వచ్చింది.

ఇప్పుడీ టెర్రరిస్ట్ పై సినిమా వస్తోంది. అతడి బయోపిక్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. షూటింగ్ ఏంటి.. రెండు రోజుల్లో ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నామంటూ చెప్పేశారు మేకర్స్. ఇంతకీ ఈ టెర్రరిస్ట్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా.. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. ఈ బాలీవుడ్ నటుడు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. టెర్రరిస్ట్ గెటప్ లో ప్రేయర్ చేస్తున్న రాజ్ కుమార్ రావ్ చుట్టూ పిస్టల్ ఎయిమ్ చేసిన సర్కిల్ కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఒమెర్టా అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం.. తను ఇప్పటివరకూ ఎంతో తేలికైన క్లిష్టమైన పాత్రను పోషించినట్లు చెబుతున్నాడు రాజ్ కుమార్ రావ్. 2012 వరకూ యాక్టివ్ గానే ఉన్న ఈ టెర్రరిస్ట్ ప్రస్తుతం లాహోర్ జైల్ లో ఉండగా.. మూడేళ్ల క్రితం సూసైడ్ ఎటెంప్ట్ చేశాడనే వార్తలు వచ్చాయి. ఇతడిని బ్రిటిష్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ రిక్రూట్ చేసుకుందని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన పుస్తకం ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ లో రాసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English