పవన్ దోస్తుకు తలనొప్పి తగ్గుద్దా?

పవన్ దోస్తుకు తలనొప్పి తగ్గుద్దా?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు బైబై చెప్పేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీ జనాల్లో విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత శరత్ మరార్. ప్రస్తుతం ఈయన పెద్ద సినిమాలకు దూరంగా ఉంటూ.. డబ్బింగ్ సినిమాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ సాధించిన ఆరామ్ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో డబ్బింగ్ చేశాడు శరత్ మరార్.

ఈ చిత్రం గతేడాది చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా రకరకాల రీజన్స్ తో.. ఈ నెల 16న  థియేటర్లలోకి వస్తోంది. ఇప్పుడీ కర్తవ్యం ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కాటమరాయుడు తరువాత పవన్ తో విభేదాలు వచ్చాక హిట్టు కొట్టే సినిమా కావాలని ఎదురు చూసి.. చివరకు ఈ చిత్రాన్ని ఎంచుకున్నాడు. నయనతారను 'లేడీ సూపర్ స్టార్' అంటూ బిరుదులు కూడా ఇచ్చి కర్తవ్యం దించుతున్నాడు. ఎలాగైనా ఈ ఫిలింతో సక్సెస్ సాధించాలన్నది ఈయన తపన. నయనతారకు కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మాట అయితే వాస్తవమే.

కానీ తెలుగుకు వచ్చేసరికి ఈమె ఓ టాప్ హీరోయిన్.. అంతే. మరి అలాంటి పరిస్థితుల్లో శరత్ మరార్ కు ఈమె ఎంత వరకు హిట్ ఇస్తుందో అన్నదే పాయింట్. హిట్టు కోసం డబ్బింగ్ బొమ్మల మీద పడ్డ పవన్ దోస్త్.. ఇది వర్కవుట్ అయితే ఇంకో రెండు మూడు దించుతాడనే టాక్ ఉంది. మరి శరత్ మరార్ ను ఈ సినిమా ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు