అక్టోబర్ ప్రేమ కోసం ప్రయాణం

అక్టోబర్ ప్రేమ కోసం ప్రయాణం

సూజిత్ సర్కార్ సినిమా అంటే.. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉంది. దాన్ని ఒక్కసారి కూడా మిస్ చేయకుండా ఇప్పటివరకూ అలాంటి సినిమాలతోనే పలకరించాడు ఈ దర్శకుడు. విక్కీ డోనర్.. మద్రాస్ కేఫ్‌.. పికూ.. పింక్.. డైరక్టర్ సూజిత్ సర్కార్.. ఇప్పుడు అక్టోబర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

వరుణ్ ధావన్.. బనితా సంధు నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను కొన్ని గంటల క్రితం విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం చూస్తుంటే.. ఎక్కడా నటీనటులు అస్సలు కనిపించరు. అన్నీ వారు పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయంటే.. ఈ ఫిలిం ఎంత రియలిస్టిక్ గా ఉండనుందో అర్ధం చేసుకోవచ్చు. అక్టోబర్ మూవీలో హీరో ఓ హోటల్ లో వాష్ రూమ్స్ క్లీన్ చేశాడంటే సినిమాలోని డెప్త్ అర్ధమవుతుంది. హీరోయిన్ తన కోసం ఎందుకు అడిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.

కాలేజ్ డేస్ లో కనీసం పలకరించని అమ్మాయి.. ఇప్పుడెందుకు తన గురించి ఆరా తీసిందో మథన పడుతుంటాడు హీరో. హీరోయిన్ ను మానసిక స్థితి కోల్పోయిన దశలోను.. ప్రేమికురాలి గాను.. హీరోకు దూరంగా ఉంటున్న పరిస్థితుల్లోనూ చూపించారు. కెమేరా పనితనం నుంచి.. థీమ్ బేస్డ్ మ్యూజిక్ వరకూ.. మొత్తం 80 సెకన్ల టీజర్ లో.. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. మరోసారి వాస్తవానికి అతి దగ్గరగా ఉండే సినిమాతో సూజిత్ సర్కార్ ప్రేక్షకులను మాయ చేయనున్నాడు. కమర్షియల్ సినిమాలు చేసే వరుణ్ ధావన్ కెరీర్ లో.. ఇదో డిఫరెంట్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English