కొడుకు హీరో.. తమ్ముడు దర్శకుడు

కొడుకు హీరో.. తమ్ముడు దర్శకుడు

పూరీ జగన్నాధ్.. ఈ పేరే ఒక బ్రాండ్. పూరీ పేరు చెప్పుకుని చాలామంది హీరోయిన్స్.. ఐటెం భామలు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. తమ వారసులను లాంఛ్ చేయించడానికి పూరీని మించిన దర్శకుడు లేడని అనేక మంది భావిస్తారు. అంతటి గుర్తింపు ఉన్న పూరీ జగన్నాధ్.. ఇప్పుడు తన కొడుకు పూరీ ఆకాష్ ను హీరోగా మలుస్తున్నాడు. మెహబూబా మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

పూరీ కొడుకు హీరోగా సత్తా చాటేందుకు ప్రిపేర్ అవుతుంటే.. ఇప్పటికే పూరీ ఇమేజ్ తో ఇండస్ట్రీలో ఉన్న ఈ దర్శకుడి సాయిరాం శంకర్.. ఇండస్ట్రీలోనే మరో ప్రొఫెషన్ వెతుక్కుంటున్నాడు. హీరోగా పలు చిత్రాల్లో కనిపించిన సాయిరాం.. దశాబ్దంన్నర కాలంగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికి 12 చిత్రాలలో యాక్ట్ చేసిన పూరీ బ్రదర్.. ఇప్పుడు అన్నను ఫాలో అయేందుకు రెడీ అయిపోతున్నాడు. దర్శకత్వంలో కిటుకులు తెలుసుకుంటూ తనవంతు క్రియేటివిటీని అందించే ప్రయత్నం చేస్తున్నాడట.

త్వరలో సాయిరాం శంకర్ ను దర్శకుడిగా కూడా చూసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పూరీ తమ్ముడు 'వాడు నేను కాదు' అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. తెలుగు.. తమిళ్.. మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండగా.. తన కెరీర్ లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని సాయిరాం శంకర్ హోప్స్ పెట్టుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English