లీకేజీలు చేస్తోంది సూపర్ స్టార్ రజీనీయేనా?

లీకేజీలు చేస్తోంది సూపర్ స్టార్ రజీనీయేనా?

రజినీకాంత్ ఫోటోలు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బైటకు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని.. కనీసం వీరాభిమానులకు కూడా ఎన్నడూ కనిపించని ఫోటోలు.. నేరుగా నెట్ లో దర్శనం ఇస్తున్నాయి. వీటి అన్నిటిలోనూ కాన్సెప్ట్ ఒకటే.. రజినీ ఎంతటి భక్తి ప్రపూర్ణుడో.. రియల్ లైఫ్ లో ఇంకెంత సింపుల్ గా ఉంటాడో చూపడమే.

ఇదంతా ఓకే కానీ.. మరి రజినీ ఇలాంటి ఫోటోలు ఎలా బైటకు వస్తున్నాయి.. అసలు ఎందుకు వస్తున్నాయి అనేదే పాయింట్. రజినీకాంత్ చాలామార్లే హిమాలయాలకు వెళ్లి.. అక్కడి స్వామిజీలను కలిసొచ్చారని అంటారు. ఆయన అనుభవాలతో తీసినదే బాబా సినిమా కూడా. మరి అప్పుడెప్పుడూ బయటకు రాని ఈ ఫోటోలు.. ఇప్పుడు రజినీ రాజకీయ రంగ ప్రవేశం అనగానే ఆయన గొప్పదనాన్ని చెప్పకనే చెప్పే ఫోటోలు లీక్ కావడం భలే విచిత్రంగా అనిపించక మానదు. జమ్మూలో రజనీ.. గుళ్లో రజనీ.. గుహలో రజనీ.. గుర్రం మీద రజనీ.. అంటూ చాలఫోటోలో రోజూ బయటకు వస్తూనే ఉన్నాయ్. అందరి ఫోన్లలోనూ తెగ నాన్తున్నాయ్.  ఇంతకీ ఈ ఫోటో లీకేజీలు చేస్తోంది ఎవరు?

అయినా హిమాలయాల్లో ఆధ్యాత్మిక టూర్లు చేస్తేనో.. రియల్ లైఫ్ లో మేకప్ లేకుండా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఓట్లు కుమ్మరించేస్తారని అనుకోవడం సరైన విషయం కాదు. ఈ విషయంపై రజినీకి కూడా అవగాహన ఉండే ఉంటుంది. కానీ ఆయనకు తాము అత్యంత సన్నిహితులు అని నిరూపించుకునేందుకు తపన పడే కొందరు ఉంటారు. వారే ఇలాంటి బయట పెట్టి.. రజినీకాంత్ కంట పడేందుకు తెగ తంటాలు పడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు