ది గ్రేట్ ఫాదర్ అవ్వాలనుకుంటున్న వెంకీ

ది గ్రేట్ ఫాదర్ అవ్వాలనుకుంటున్న వెంకీ

వెంకటేష్ కు రీమేక్ సినిమాలు కొత్తేమీ కాదు. కంటెంట్ బాగుండాలే కానీ.. ఆ భాషా చిత్రం.. వాళ్లు చేసిన సినిమా.. ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోడు. నచ్చితే మాత్రం మొహమాటం లేకుండా రీమేక్స్ చేసేస్తాడు. వెంకీ కెరీర్ లో ఇలా రీమేక్ గా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన అనేక చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు మరో రీమేక్ కూడా వెంకటేష్ ఖాతాలో పడబోతోందనే టాక్ వినిపిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రూపొందిన థ్రిల్లర్ మూవీ 'ది గ్రేట్ ఫాదర్'. పదేళ్ల కూతురిని దారుణంగా మానభంగం చేసిన వ్యక్తిని.. అతని తల్లిదండ్రులు- పోలీసులు ఎలా మట్టుపెట్టారన్నదే ఈ మూవీ స్టోరీ. ఆద్యంతం ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ మలయాళ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి తెచ్చేందుకు వెంకటేష్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మూవీ మేకర్స్ కు పలు భాషల నుంచి క్రేజీ ఆఫర్లే వస్తున్నాయి. తమిళ్ రీమేక్ లో విక్రమ్ నటిస్తుండగా.. తెలుగు ప్రాజెక్టుపై వెంకీ ఆసక్తి చూపుతున్నాడు.

సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ను సమపాళ్లలో మిక్స్ చేసిన ది గ్రేట్ ఫాదర్.. తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించే కథ అని వెంకీ నమ్ముతున్నాడట. ప్రస్తుతం ఆట నాదే- వేట నాదే అంటూ తేజ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను ఈ నెల 26 నుంచి ప్రారంభించబోతున్నాడు వెంకీ. జూలై నాటికి విడుదల చేయాలనే టార్గెట్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు