జనసేన పాట.. హిట్టిచ్చినోళ్ళు కనబడలే

జనసేన పాట.. హిట్టిచ్చినోళ్ళు కనబడలే

సినిమాల నుంచి విరామం తీసుకున్నాడో.. లేక శుభం కార్డు వేశాడో చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి పవన్ పేరు మాత్రం సినిమా సంగతుల్లో వినిపించడం లేదు. అయితే.. జనసేన అంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిపోవడంతో.. పవర్ స్టార్ అప్ డేట్స్ ప్రతీ రోజూ వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు 'ఇంకెన్ని గాయాలు' అంటూ ఓ పాట విడుదల అయింది. జనసేన పార్టీ కోసం ఈ పాటను కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. పవన్ తో కలిసి గోపాలా గోపాలా.. కాటమరాయుడు చిత్రాలకు పని చేసిన ఈ కంపోజర్.. ఇప్పుడు పవన్ పార్టీ కోసం ఈ వీడియో సాంగ్ రూపొందించాడు. 1947కు ముందు స్వతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఏర్పాటుకు ముందు పోరాటం వరకూ విజువల్స్ ఇందులో ఉన్నాయి. పవన్ మాటల నుంచే ఈ పాటను తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు అనూప్ రూబెన్స్.

పాట ట్యూన్ బాగానే కుదిరినా.. తనకు ఫ్లాపులు ఇచ్చిన కంపోజర్ తో పవన్ పార్టీ కోసం ఇలా వీడియో సాంగ్స్ తయారు చేస్తుండడం విశేషం. పవన్ కు బెస్ట్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తో ఇలాంటివి కంపోజ్ చేయిస్తే.. వాటి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందని అనడంలో సందేహం లేదు. మరి వాళ్లు డబ్బులు ఎక్కువ అడిగారో.. టైం ఎక్కువ పడుతుందని చెప్పారో కానీ.. తనను అభిమానించే అనూప్ తోనే పూర్తి చేయించాడు పవన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English