పార్టీకి పనయ్యేట్టే వుంది

పార్టీకి పనయ్యేట్టే వుంది

కిరాక్‌ పార్టీ చిత్రాన్ని పది కోట్ల రేంజిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. నిఖిల్‌ సినిమాకి ఇది గిట్టుబాటు ధరేనని చెప్పాలి. నిఖిల్‌ సినిమా హిట్టయితే పదిహేను కోట్ల స్థాయిలో వసూలు చేస్తుంది. ఫెయిలైన సినిమాలు కూడా ఏడెనిమిది కోట్ల రేంజిలో బిజినెస్‌ చేసాయి.

సో పది కోట్లంటే అతని మార్కెట్‌ని దృష్టిలో వుంచుకుని విక్రయించినట్టే. కన్నడలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దానిని యథాతథంగా రీమేక్‌ చేయకుండా తెలుగు వారి అభిరుచికి తగ్గట్టు మార్పు చేర్పులు చేసారు. నిఖిల్‌ మాత్రం ఈ చిత్రం యూత్‌ని విపరీతంగా అలరిస్తుందని, హ్యాపీడేస్‌ స్థాయిలో ఆడేస్తుందని నమ్ముతున్నాడు. అందుకే ఈ చిత్రంపై అమితమైన నమ్మకం ప్రదర్శిస్తూ విడుదలకి ముందే కాలేజ్‌ టూర్లకి వెళుతున్నాడు. విశేషంగా ప్రచారం చేస్తూ స్టూడెంట్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

థియేటర్ల బంద్‌ కారణంగా సినీ ప్రియులకి రెండు వారాలుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా పోయింది. అ తర్వాత మళ్లీ చెప్పుకోతగ్గ సినిమానే లేదు. ఈ టైమ్‌లో రావడం కిరాక్‌ పార్టీకి ప్లస్‌ అవుతుంది. ఏమాత్రం టాక్‌ బాగా వచ్చినా కానీ తక్కువ రేట్లకి అమ్మడం భలేగా కలిసి వస్తుంది. కాకపోతే వారానికో కొత్త సినిమా వున్న దశలో మొదటి వారంలోనే ఎంత రాబట్టుకుంటే అంత మంచిది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English