హీరోనే సినిమా ఆపేయ్‌మన్నా వినలేదట

హీరోనే సినిమా ఆపేయ్‌మన్నా వినలేదట

విజయ్‌ దేవరకొండ దూసుకుపోతున్న టైమ్‌లో ఎప్పుడో తాను హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతోన్న టైమ్‌లో చేసిన సినిమా ఒకటి విడుదలైంది. 'ఏ మంత్రం వేసావె' అంటూ వచ్చిన ఈ సినిమాకి నామమాత్రపు వసూళ్లు కూడా రావడం లేదు. అర్జున్‌ రెడ్డి సినిమాని ఎగబడి చూసిన వాళ్లే ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. ఈ చిత్రం నోటీస్‌ అవకుండా చూసుకోవడంలో విజయ్‌ చాలా కేర్‌ తీసుకున్నాడు. ఎక్కడా దీనికి ప్రచారం చేయకుండా, ప్రమోషన్లకి పూర్తిగా దూరంగా వుండిపోయాడు.

ఈ సినిమా విడుదలైన రోజే నోటా అంటూ కొత్త సినిమా మొదలుపెట్టి అటెన్షన్‌ అటు డైవర్ట్‌ చేసాడు. అయితే అతనెంత కాదన్నా ఇది తన ఖాతాలో ఒక ఫ్లాప్‌గానే మిగిలిపోతుంది. ఈ చిత్రం విడుదల కాకుండా విజయ్‌ ఎందుకు చూసుకోలేకపోయాడు? అతను తలచుకుంటే రిలీజ్‌ ఏదో విధంగా ఆపేసి ఆ నిర్మాతకి కాంపన్సేట్‌ చేసేవాడు కదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి విజయ్‌కి కూడా ఆ ఆలోచన వచ్చిందట.

సదరు నిర్మాతతో మాట్లాడి రిలీజ్‌ ఆపేయమని, వాళ్లకి తను ఇంకో సినిమా చేసి పెడతానని చెప్పాడట. అయితే అతనితో సినిమా తీయాలంటే ఎన్నో కోట్లతో కూడుకున్న పని కనుక దీనిని విడుదల చేసుకోవడానికే మొగ్గు చూపారట. ప్రచారానికి మాత్రం రాలేనని చెప్పేసి ఈ చిత్రంతో అక్కడితో తెగతెంపులు చేసుకున్నాడట. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు