మహేష్‌కి రొమాన్స్‌కి టైమ్‌ లేదు

మహేష్‌కి రొమాన్స్‌కి టైమ్‌ లేదు

జనతా గ్యారేజ్‌లో హీరోయిన్ల పాత్ర ఎంత పరిమితమో, కొరటాల శివ కొత్త సినిమా 'భరత్‌ అనే నేను'లోను అంతేనట. మహేష్‌లాంటి పెద్ద స్టార్‌ సినిమాలో హీరోయిన్‌ లేకపోతే సమస్య అవుతుంది కనుక పేరుకి మాత్రం ఒక హీరోయిన్‌ని పెట్టారట. బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ కథానాయికగా చేస్తోంది.

ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి మాత్రమే వుంటుందని, పాటల అవసరం వున్నప్పుడు మాత్రమే హీరోయిన్‌ కనిపించి పోతుందని, అసలు కథలో ఆమెకి అసలు ఇంపార్టెన్స్‌ లేదని సమాచారం. అందుకే టీజర్‌లో హీరోయిన్‌ షాట్‌ ఒక్కటి కూడా లేదట. ఆమెకోసం ప్రత్యేకించి టీజర్‌ కట్‌ చేసే ఆలోచనలు కూడా లేవట. ఇందులో మహేష్‌కి సెక్రటరీగా కియారా కనిపిస్తుందని, అతనిపై మనసు పారేసుకుని ఊహల్లో పాటలు పాడుకునే సగటు హీరోయిన్‌గా దర్శనమిస్తుందని తెలిసింది.

హీరో హీరోయిన్లపై రెండే డ్యూయెట్లు వుంటాయట. వాటి చిత్రీకరణ ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. ఏప్రిల్‌ 5తో షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్‌ 20న అంగరంగ వైభవంగా విడుదలకి రంగం సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English