నాగార్జున వున్నా సేల్‌ అవట్లేదు

నాగార్జున వున్నా సేల్‌ అవట్లేదు

నాగార్జున హీరో అయినా కానీ రాంగోపాల్‌వర్మ దర్శకుడు కావడంతో ఆఫీసర్‌ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు. వర్మ ఈమధ్య కాలంలో తీసిన సినిమాల సంగతి తెలిసిన వారు ఈ ఆఫీసర్‌కి దూరంగా వుంటున్నారు. చాలా కాలం తర్వాత పెద్ద స్టార్‌తో సినిమా కనుక వర్మ జాగ్రత్తగానే తీసి వుంటాడనే ఫీల్‌ కలుగుతున్నా కానీ, ఇటీవలే అమితాబ్‌బచ్చన్‌తో తీసిన సర్కార్‌ 3 ఫలితమేంటనేది చూసారు కనుక ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.

కనీసం స్టిల్స్‌, పోస్టర్స్‌తో అయినా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయా అంటే అదీ లేదు. అవన్నీ కూడా వర్మ రీసెంట్‌ ఆణిముత్యాలనే తలపిస్తున్నాయి. నాగార్జున సయితం తన ట్రేడ్‌మార్క్‌ గ్లామర్‌ మిస్‌ అయి అదోలా కనిపిస్తూ వుండడంతో అభిమానుల్లోను ఈ చిత్రంపై ఎలాంటి ఇంట్రెస్ట్‌ జనరేట్‌ అవడం లేదు. నాగార్జున ఇటీవల ఏ సినిమా చేసినా కానీ హాట్‌ కేక్‌లా సేల్‌ అయిపోయింది. కానీ ఈ చిత్రానికి నాగార్జున వున్నా కానీ రాంగోపాల్‌వర్మ బ్రాండింగ్‌ డామినేట్‌ చేస్తోంది.

ఆశించిన రేట్లు రాని పక్షంలో సొంతంగా విడుదల చేసుకోవాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. తనకి శివతో బ్రేక్‌ ఇచ్చిన వర్మ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో వుండడంతో నాగార్జున ఈ చిత్రం చేస్తున్నాడని, శివ కాంబినేషన్‌ అనేసరికి క్రేజ్‌ అదే వచ్చేస్తుందని అంచనా వేసారని, కానీ రియాలిటీ వారి అంచనాలకి చాలా దూరంగా వుండడంతో ఇప్పుడు ప్లాన్‌ బి అమలు చేయాలని చూస్తున్నారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English