సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నదెవరు?

సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నదెవరు?

అనతికాలంలోనే సాయి పల్లవి పెద్ద స్టార్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమెకి తెలుగునాట వున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. స్టార్‌ హీరోలతో నటించకుండానే ఆమెకి లక్షల్లో అభిమానులున్నారు. ఇక స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే టైమ్‌కి ఇంకెంత పాపులర్‌ అవుతుందో మరి? సూపర్‌ టాలెంటెడ్‌ అయిన సాయి పల్లవి తన టర్మ్స్‌ మీదే పని చేస్తుంది తప్ప సినిమా ఇండస్ట్రీ కోరుకునేటట్టు వుండదు. సక్సెస్‌ వున్న వారి వెంట పడే ఇండస్ట్రీ తాను చెప్పినట్టు నడుచుకోని నటీనటులపై కక్ష కడుతుంది.

కథ నచ్చకపోతే ఎంతటి నిర్మాతకైనా నో చెప్పేసే సాయి పల్లవి తన పాత్ర నిడివి తగ్గిస్తే నిర్మాతని నిలదీస్తుంది. దీంతో ఆమెకి తల పొగరు అని, డిసిప్లిన్‌ లేదని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఎలాగైనా సాయి పల్లవికి ఇండస్ట్రీలో బ్యాడ్‌ నేమ్‌ తీసుకొచ్చి ఆమెకి అవకాశాలు రాకుండా చూడడానికి ఒక వర్గం పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. కొత్తగా తనకి అసలు ఏమాత్రం పాపులర్‌ కాని హీరోలతో లింకులు పెట్టి ప్రచారం చేయడం కూడా స్టార్టయింది.

ఒక యువ నటిపై ఈ స్థాయిలో బురద జల్లుడు ఎప్పుడూ జరగలేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోతోందా లేక ఎవరైనా కావాలనే చేస్తున్నారా అనేది తెలియడం లేదు. సాయి పల్లవి మాత్రం తన పని తాను చేసుకుంటూ ఇలాంటి వాటిని లెక్క చేయకుండా ముందుకి సాగిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English