హలో ఈవెంట్లో పాప పిచ్చెక్కించిందిగా

హలో ఈవెంట్లో పాప పిచ్చెక్కించిందిగా

బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనే. ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని ఆక్రమించేసిన ఈమె.. అందుకు తగ్గ సినిమాలనే ఎంచుకుంటూ కెరీర్ లో తన బెస్ట్ ఫేజ్ ను కంటిన్యూ చేస్తోంది. మరి ఇలాంటి టాప్ బ్యూటీ.. తన స్థాయికి తగినట్లుగానే ఎక్స్ పోజింగ్ చేస్తే ఎలా ఉంటుంది?

దీపికా పదుకొనేకు ఎక్స్ పోజింగ్ కొత్తేమీ కాదు. అందాల ప్రదర్శన విషయంలో ఈమెకు అంతగా పరిధులు ఉన్నట్లుగా కనిపించదు. కానీ రేంజ్ పెరిగిన తర్వాత తన  స్థాయికి తగిన విధంగానే ఉంటోంది డిప్స్. ఇప్పుడీ సుందరి హలో అవార్స్ ఈవెంట్ లో సందడి చేసేసింది. బోలెడంత పొడవు ఉన్న వస్త్రాన్ని ఒంటిమీద కప్పుకున్నా.. ఈమెలోని స్త్రీత్వాన్ని చాటి చెప్పే స్థాయిలో దర్శనం ఇచ్చింది. కంప్లీట్ గా క్లీవేజ్ ని కెమేరా ముందు ఆరబోసేసి.. మొత్తం ఈవెంట్ కు వచ్చిన ఆహ్వానితులు.. ఆహుతులు.. నిర్వాహకులు అంతా మైమరచిపోయేలా ధవళ వర్ణపు వస్త్రాలలో మెరుపులీనింది.

అంతటి అద్భుత సౌందర్యరాశి తమకు కనిపించడమే మహాద్భుతం అని పదుగురూ తెగ బాధపడితుంటే.. వీరి బాధను మరింత పెంచడానికి వచ్చేశాడు రణవీర్ సింగ్. ఆమెతో కలిసి ఫోటోలకు పోజులు ఇస్తూ మరింతగా రెచ్చగొట్టేశాడు. తన ప్రియుడిని తో కలిసి అభిమానులను తెగ రెచ్చగొట్టే పోజులతో అలరించింది దీపికా పదుకొనే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English