పిక్ టాక్: హాటు హాటుగా ఆరబోస్తూ..

పిక్ టాక్: హాటు హాటుగా ఆరబోస్తూ..

సాధారణంగా ఒక్కసారైనా టాలీవుడ్ తెరపై కనిపించాలని మోడల్స్ కి చాలా ఆసక్తి ఉంటుంది. ఒక్క హిట్టు కొడితే మంచి కెరీర్ ఉంటుందని వారి నమ్మకం. అయితే ఆ తరహాలో కష్టపడి అవకాశం దక్కించుకున్న నార్త్ క్యూట్ గర్ల్ శాన్వి. అమ్మడు లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో శాన్వికి గుర్తింపు దక్కింది. ఆ  తరువాత అడ్డా అండ్ రౌడీ సినిమాల్లో అవకాశాలు అందుకున్న శాన్వి కన్నడ ఆఫర్స్ ను కూడా బాగానే అందుకుంది.

తెలుగులో ఈ మధ్య ఎక్కువగా కనిపించని శాన్వి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటోంది. తెలుగు పండగలు జరిగినప్పుడు స్పెషల్ గా విషెస్ కూడా అందిస్తోంది. అంతే కాకుండా స్పెషల్ ఫొటో షూట్స్ తో కూడా శాన్వి చాలా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోలు అయితే నెటీజన్స్ మతి పోగొడుతున్నాయ్ అంతే. మొన్నటి వరకు ఓ లెవెల్లో కనిపించిన శాన్వి ఇప్పుడు మాత్రం సరికొత్త స్టైల్ లో సెక్సీగా అలరిస్తోంది. కాస్త హాట్ గా ఉన్న అందాలను ఆరబోస్తూ.. చిన్న స్మైల్ తో చితక్కొట్టేస్తోంది.

ఇక ఆమె పెదాలు అందంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా కూడా.. ఎందుకో మనోళ్లకు హీరోయిన్ గా పెద్దగా ఆనట్లేదు. అందుకే కదా లవ్లీ బ్యూటీ శాన్వి మన సినిమాల్లో కనిపించట్లేదు. ఏం. సీరత్ కపూర్ బికినీ ఫోటోలు పెడితే బోలెడు అవకాశాలు ఇచ్చారు.. శాన్వికి ఇవ్వరా అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English