శ్రీదేవి కుటుంబం ఇక్క‌డికి రాలేదేం?

శ్రీదేవి కుటుంబం ఇక్క‌డికి రాలేదేం?

సినీ ధ్రువ‌తార శ్రీదేవి చ‌నిపోయి అప్పుడే ప‌దిహేను రోజుల పైగా అయిపోయింది. ఆమె లేదంటే జీర్ణించుకోలేని అభిమానులు ఎంతో మంది. ఇక ఆ త‌ల్లి బిడ్డ‌ల‌కు అమ్మ లేద‌న్న నిజం ఎప్ప‌టికీ మింగుడుప‌డని విష‌య‌మే. శ్రీదేవి తెలుగు త‌మిళ‌ హిందీ సినిమాల‌లో టాప్ రేంజ్‌కి వెళ్లిన హీరోయిన్‌. అందుకే ఆయా ప‌రిశ్ర‌మ‌ల వాళ్లు శ్రీదేవి సంతాప స‌భ ఏర్పాటు చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన స‌భ‌కు... శ్రీదేవి కుటుంబం హాజ‌రైంది. అంత‌కుముందే తెలుగు ప‌రిశ్ర‌మ కూడా ఏర్పాటు చేసింది. కానీ శ్రీదేవి కుటుంబం నుంచి ఒక్క‌రు కూడా స‌భ‌కు హాజ‌రుకాలేదు.

శ్రీదేవిని దేవ‌త‌గా ఆరాధించే వారిలో స‌గానికి పైగా తెలుగు అభిమానులే ఉంటారు. మిగ‌తా భాష‌ల‌తో పోలిస్తే శ్రీదేవి తెలుగులో చేసిన సినిమాలే ఎక్కువ‌. ఆమెను స్టార్ హీరోయిన్‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవ‌డానికి తెలుగు పరిశ్ర‌మ భాగ‌స్వామ్యం కూడా త‌క్కువేమీ కాదు. అయినా ఎందుకోమ‌రి... తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసిన సంతాప‌స‌భ‌కు శ్రీదేవి కుటుంబం నుంచి ఒక్క‌రూ హాజ‌రుకాలేదు. అదే చెన్నైలో త‌మిళ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసిన స‌భ‌కు... శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్‌ కూతుళ్లు జాన్వీ అండ్ ఖుషీ కూడా హాజ‌ర‌య్యారు. వారిలో ఒక్క‌రు మ‌న స‌భ‌కు కూడా హాజ‌రైతే బాగుండేదేమో. ఈ విష‌యంలో మన సినీ అభిమానులు కాస్త ఆవేద‌న‌ చెందుతున్నారు.

శ్రీదేవి గ‌త నెల 24న దుబాయ్‌లో అక‌స్మాత్తుగా మ‌ర‌ణించారు. మేన‌ల్లుడి పెళ్లికి దుబాయ్ వెళ్లిన ఆమె... ఆ పెళ్లి అయిన నాలుగ‌వ రోజున మ‌ర‌ణించారు. మొద‌ట కార్డియాక్ అరెస్టు వ‌ల్ల మ‌ర‌ణించార‌ని అనుకున్నారంతా... ఆమె భ‌ర్త కూడా అలాగే అంద‌రికీ చెప్పారు. పోస్టు మార్టం రిపోర్టు వ‌చ్చాక‌... ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్ ట‌బ్‌లో ప‌డి ఊపిరాడక మ‌ర‌ణించిన‌ట్టు తెలిసింది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English