పవన్ అండ్ బాలయ్య.. అమరావతి తీసుకెళ్తారేమో

పవన్ అండ్ బాలయ్య.. అమరావతి తీసుకెళ్తారేమో

మొన్న బాల‌య్య‌... ఈరోజు ప‌వ‌న్ క‌ళ్యాన్‌... ఇద్ద‌రూ ఇళ్లున అమ‌రావ‌తికి షిప్ట్ చేసేస్తున్నారు. మెల్ల‌గా వ‌ల‌స మొద‌లైంద‌నే చెప్పుకోవాలా?  వీళ్ల‌ని చూసి మ‌రికొంద‌రు కూడా వారి బాట ప‌డ‌తారా? ఇప్పుడిదే  ఫిల్మ్ న‌గ‌ర్లో హాట్ టాపిక్ అయిపోతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన‌ప్పుడే టాలీవుడ్ గురించి కూడా చ‌ర్చ‌లు అయ్యాయి. తెలుగు ప‌రిశ్ర‌మ కూడా రెండుగా విడిపోతుందా ఆంధ్రాకు త‌ర‌లిపోతుందా అని అంటే... అలాంటిదేమీ లేద‌నే స‌మాధానం సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల నుంచి వ‌చ్చింది. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితి చూస్తుంటే మాత్రం క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇద్ద‌రు పెద్ద హీరోలు గుంటూరులో ఇళ్లు కట్టుకుంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాల‌కృష్ణ ఇప్ప‌టికే ఆ ప‌నిని ఎప్పుడో మొద‌లుపెడితే... టాప్ హీరో... జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇదిగో ఇప్పుడు త‌న కొత్త ఇంటికి భూమిపూజ చేశాడు. రెండెక‌రాల సువిశాల విస్తీర్ణంలో ఇల్లు... ఆఫీసు ఒకేచోట క‌ట్టుకోబోతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో ఇద్ద‌రు స్టార్ హీరోలు అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర్లో ఇల్లు క‌ట్టుకుంటుంటే మిగ‌తా వాళ్లు చూస్తూ ఊరుకుంటారా?  వారికి కూడా ఆ రాష్ట్ర రాజ‌ధానిలో ఓ ఇల్లు ఉండాల‌ని ఉంటుంది క‌దా. అలా ఒక‌రిని చూసి ఒక‌రుగా అక్క‌డికి చేరే అవకాశం ఉందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు సినీ జ‌నాలు. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో అల‌రించే అందాలెన్నింటినో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. ఎక్కువ మంది సినీ ప్ర‌ముఖులు అక్క‌డికి చేరితే... టాలీవుడ్ స‌గం అమ‌రావ‌తికి చేరిన‌ట్టే అవుతుంది.

హైద‌రాబాద్ మాత్రం పుట్టుక‌తోనే టాలీవుడ్‌కు పుట్టినిల్లా ఏంటీ? అంత‌కుముందు అంద‌రూ చెన్నైలో ఉండేవారు. మొద‌టిసారి ఏఎన్నార్ న‌గ‌రంలోని బంజారా హిల్స్ లో బేగంపేటలో ఇల్లు కొనుక్కుని మ‌కాం ఇక్క‌డికి మార్చారు. ఆయ‌న‌ను చూసి మిగ‌తావారంతా లైను క‌ట్టారు. ఈ సారి కూడా అలాగే జ‌ర‌గ‌చ్చునేమో. ఎవ‌రికి తెలుసు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English