కన్ను కొట్టిన పిల్లకు ఫోన్ ఉంది.. సిమ్ లేదు

కన్ను కొట్టిన పిల్లకు ఫోన్ ఉంది.. సిమ్ లేదు

ప్రియ ప్రకాష్ వారియర్.. ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది కుర్రకారుకు కలల రాణి. కేవలం 30 సెకన్ల వీడియోతో ఈ అమ్మాయి రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. ఆ వీడియోలో ఆమె కన్ను కొట్టిన తీరుకు, తన హావభావాలకు కోట్లాది మంది దాసులైపోయారు. ఆమెకు మలయాళం నుంచే కాక పలు భాషల నుంచి అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ఐతే తనకు ఇలాంటి గుర్తింపు వస్తుందని కలలో కూడా అనుకోలేదని అంటోంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రియ ఆక్తికర విషయాలు పంచుకుంది. తన దగ్గర వన్ ప్లస్ ఫోన్ అయితే ఉందని.. కానీ సిమ్ మాత్రం లేదని ప్రియ చెప్పడం విశేషం. ఇప్పటికీ తాను తల్లిదండ్రుల చాటు పిల్లనే అని.. వాళ్లు తనకు సిమ్ వాడే స్వాతంత్ర్యం ఇవ్వలేదని ఆమె చెప్పింది.

అవసరమైతే తాను తన తల్లి ఫోన్ వాడతానని.. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉంటేనే ఫోన్ వాడగలనని ప్రియ చెప్పింది. ‘ఒరు అడార్ లవ్’లోని తన వీడియో వైరల్ ఏ స్థాయిలో వైరల్ అయిందనేది తర్వాత తర్వాత కానీ అర్థం కాలేదని ప్రియ తెలిపింది. తన తండ్రి కలీగ్ ఒకరు ఆ వీడియోను తన తండ్రికే పంపారని.. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా కన్ను కొట్టిందంటూ కామెంట్ చేశారని.. ఆ అమ్మాయి తన కూతురే అంటూ తన తండ్రి బదులిచ్చారని.. అప్పుడు అవతలి వ్యక్తికి నోట మాట రాలేదని.. తన వీడియో అనుకున్న దాని కంటే ఎక్కువ పాపులర్ అయిన సంగతి అప్పుడే అర్థమైందని ప్రియ తెలిపింది. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపుతో బాగానే ఆర్జిస్తున్నట్లుగా ప్రియ వెల్లడించింది. ప్రింగిల్స్, వన్ ప్లస్, హిప్‌స్టర్ వంటి బ్రాండ్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడితే ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల దాకా చెల్లిస్తున్నట్లు ఆమె తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English