రెండు కోట్లు పెడుతున్నారు!! ఏమ‌వుతుందో?

రెండు కోట్లు పెడుతున్నారు!! ఏమ‌వుతుందో?

కిరాక్ పార్టీ... నిఖిల్ కొత్త సినిమా. అతి త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. క‌న్న‌డ సూప‌ర్ హిట్ అయిన చిన్న సినిమా ఇది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. నిఖిల్ హీరోగా సిమ్రాన్ ప‌రీన్జా అండ్ సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ ప్ర‌చార ఊపును పెంచ‌డానికి సిద్ధ‌ప‌డింది. ఎంత‌గా అంటే.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే కోట్లు ఖ‌ర్చుపెట్టేంత‌గా!!

కిరాక్ పార్టీ సినిమా మార్చి 16న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్ర‌యూనిట్ ప‌బ్లిసిటీ టూర్లను ప్ర‌ణాళిక వేసేసింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, విజ‌య‌న‌గ‌రం, తిరుప‌తి ఇలా ప‌లు ఊళ్లు తిరుగుతూ ప్ర‌చారం నిర్వ‌హించాలనుకుంటోంది. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే రెండు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెడుతోంద‌ట‌. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్లో ప‌బ్లిసిటీ చేయ‌డ‌మేంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు సినీజ‌నాలు. చెర్రీ, బ‌న్నీ, ప్ర‌భాష్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కే ప‌బ్లిసిటీ కోసం అంత ఖ‌ర్చుపెట్టరు. అలాంటిది నిఖిల్ లాంటి చిన్న హీరో... కొత్త హీరోయిన్లు... అందులోనూ రీమేక్ సినిమా... దీనిపై రెండు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్ట‌డ‌మేంటో అర్థం కావ‌డం లేదు అంటున్నారు విశ్లేషకులు.

క‌చ్చితంగా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌క‌మా లేక యావ‌రేజ్‌గా ఉన్న సినిమాను భారీగా ప‌బ్లిసిటీ చేసి హిట్ కొట్టించేద్దామ‌న్నా ప్లానో మరి. క‌న్న‌డ‌లో హిట్ అయినంత మాత్రాన తెలుగులో కూడా హిట్ట‌వ్వాల‌న్న న‌మ్మ‌కం లేదుగా. ఎన్నో సినిమాలు రీమేక్‌లు అవ్వ‌డం అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డం జ‌రిగిపోయాయి. కిరాక్ పార్టీ చిత్ర యూనిట్ మాత్రం భారీగా ప‌బ్లిసిటీ కోసం ఖ‌ర్చుపెట్టాల‌ని నిర్ణ‌యించేసింది.

కిరాక్ పార్టీ కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే సినిమా. సినిమాలో స‌గానికిపై విజ‌య‌వాడ‌లో కెఎల్ యూనివర్సిటీలో చిత్రీక‌ర‌ణ అయ్యింది. అందుకేనేమో విజ‌య‌వాడ‌ గుంటూరు యువ‌త‌ను లైన్లో పెట్టేందుకు చిత్ర‌ యూనిట్ విజ‌య‌వాడ చేరుకునే ప్లాన్‌లో ఉంది. ఈ సినిమా ముఖ్యంగా న‌లుగురు విద్యార్థుల చుట్టూ తిరిగే క‌థ. మార్చి 16న సినిమా విడుదలవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English