శ్రీదేవి స్థానంలో ఆ హీరోయిన్

శ్రీదేవి స్థానంలో ఆ హీరోయిన్

పెళ్లయ్యాక చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరమైపోయింది శ్రీదేవి. ఐతే కొన్నేళ్ల కిందట ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి అందులో అద్భుతమైన నటనతో తన ప్రత్యేకతను చాటుకుంది. గత ఏడాది ‘మామ్’తో శ్రీదేవి మరోసారి తనదైన ముద్ర వేసింది. ఈ ఊపులో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ బేనర్లో ‘షిదత్’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించడానికి శ్రీదేవి అంగీకారం తెలిపింది. ఐతే ఇటీవలే శ్రీదేవి హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. శ్రీదేవి లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేకపోతున్న కరణ్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలింది.

శ్రీదేవి స్థానంలో మరో మాజీ అగ్ర కథానాయికను కరణ్ తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ కథానాయిక మరెవరో కాదు.. మాధురీ దీక్షిత్. ఆమెను ఇటీవలే కరణ్.. శ్రీదేవి కోసం అనుకున్న పాత్ర కోసం అడిగాడట. ఆమె ఇంకా అంగీకారం తెలపాల్సి ఉంది. శ్రీదేవి తర్వాత అంతటి స్టేచర్ ఉన్న నటి మాధురీనే కాబట్టి ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని కరణ్ భావిస్తున్నాడట. ఈ చిత్రాన్ని ‘2 స్టేట్స్’ దర్శకుడు అభిషేక్ వర్మన్ రూపొందించబోతున్నాడు. వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించనుంది. మాధురి ఓకే చెబితే వెంటనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English