సురేష్ బాబు చెప్పాకే నాని దిగాడట

సురేష్ బాబు చెప్పాకే నాని దిగాడట

దర్శకత్వ విభాగంలో చేరి.. ఆ తర్వాత అనుకోకుండా నటులైన కొద్ది మందిలో నాని ఒకడు. ‘రాధాగోపాలం’ సినిమాకు బాపు లాంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు నాని. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ వద్దకు చేరాడు. అనుకోకుండా అతను ‘అష్టాచెమ్మా’తో నటుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమా బాగా ఆడటంతో నటుడిగానే కంటిన్యూ అయిపోయాడు. మధ్యలో కొంత ఒడుదొడుకులు ఎదుర్కొన్నా తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. ఇప్పుడు నాని స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు తానున్న స్థాయికి అదృష్టం కూడా కొంత కారణమే అంటున్నాడు నాని. తాను నటుడిగా మారడమే ఆశ్చర్యం కలిగించే విషయమని అతనన్నాడు. నిజానికి తనకు ఈ విషయంలో ఆసక్తి లేదని చెప్పాడు. ‘అష్టాచెమ్మా’కు తనను కథానాయకుడిగా తనను అడిగినపుడు సందిగ్ధంలో ఉన్నానని.. ఎందుకంటే దర్శకుడు కావడమే అప్పటికి తన ధ్యేయమని నాని వెల్లడించాడు. ఐతే ‘అష్టాచెమ్మా’ సమర్పకుడు సురేష్ బాబు, మరికొందరు మాత్రం తనను వారించారని.. దర్శకుడు కావాలనుకుంటే ఎప్పుడైనా కావొచ్చని.. నటుడిగా మళ్లీ అవకాశం రాకపోవచ్చని.. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూస్తే.. ‘అష్టాచెమ్మా’ ఒక మధుర జ్జాపకంగా మిగులుతుందని చెప్పడంతో తాను కన్విన్స్ అయ్యానని.. ఆ సినిమాలో నటించానని నాని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు