చైనాలో ఆ హీరో కూడా దంచుతున్నాడు

చైనాలో ఆ హీరో కూడా దంచుతున్నాడు

ప్రపంచంలోని చాలా దేశాలకు ఇండియన్ సినిమా విస్తరించింది కానీ.. చైనా లాంటి పెద్ద దేశంలో మాత్రం మనవాళ్లకు చాలా ఏళ్ల పాటు ఎంట్రీ దొరకలేదు. అక్కడి మార్కెట్ సంక్లిష్టత, రిలీజ్ కష్టాలు దృష్ట్యా.. కలెక్షన్లలో దక్కే వాటా చాలా తక్కువ అన్న కారణం వల్ల అక్కడ మన సినిమాల్ని అక్కడ విడుదల చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు నిర్మాతలు. కానీ చైనా మార్కెట్లో ఉన్న బలమేంటో ఇండియన్ సినిమాకు పరిచయం చేశాడు అమీర్ ఖాన్. అతడి సినిమాలు ఒక్కొక్కటిగా అక్కడ ఆదరణ పొంది.. ‘దంగల్’ దగ్గరికి వచ్చేసరికి వసూళ్ల మోత మోగిపోయింది. అమీర్ ప్రొడక్షన్లో వచ్చిన కొత్త సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సైతం అక్కడ అదరగొట్టేసింది.

ఈ ఊపులో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ను సైతం చైనాలో ఇటీవలే పెద్ద ఎత్తున విడుదల చేశారు. అమీర్ సినిమాల స్థాయిలో కాదు కానీ.. ఇది కూడా అక్కడ మంచి వసూళ్లే రాబడుతోంది. ‘దంగల్’ లాగే ఇది కూడా మనసుల్ని కదిలించే సినిమా కావడంతో చైనీయులు దీనికి మంచి ఆదరణ చూపుతున్నారు. వారం రోజుల్లో ఈ చిత్రం చైనాలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చైనాలో విడుదలైన తొలి సల్మాన్ సినిమా ఇదే. తొలి ప్రయత్నంలోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లంటే చిన్న విషయమేమీ కాదు. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.200 కోట్ల మార్కును అందుకునే అవకాశముంది. దీన్ని పునాదిగా చేసుకుని ముందు ముందు అమీర్ లాగే సల్మాన్ కూడా చైనాలో మంచి మార్కెట్ సృష్టించుకోవడానికి అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు