ఆయన తప్పు చేయలేదు.. భార్య సర్టిఫికెట్

ఆయన తప్పు చేయలేదు.. భార్య సర్టిఫికెట్

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి గురించి షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి నిన్నట్నుంచి. తన భార్య ఆలియా మీద అతను నిఘా పెట్టాడని.. ఒక డిటెక్టివ్‌ను నియమించి మరీ ఆమె కాల్ డేటాను సేకరించేందుకు ప్రయత్నించాడని ముంబయి మీడియా రిపోర్ట్ చేసింది.

తమ కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన థానె పోలీసులు.. 11 మందిని అదుపులోకి తీసుకోగా అందులో ఇద్దరు డిటెక్టివ్‌లు కూడా ఉన్నారు. అందులో ఒక డిటెక్టివ్ తాను నవాజుద్దీన్ కోసం పని చేశానని.. ఆయన కోరిక మేరకు తన భార్య కాల్ డేట్ సేకరించానని పోలీసుల దగ్గర చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఆరోపణల్ని నవాజుద్దీన్ ఇప్పటికే ఖండించగా.. ఇప్పుడు స్వయంగా అతడి భార్య అంజలినే ఈ ఆరోపణలపై స్పందించింది. తన భర్త అలాంటి వాడు కాదంటూ ఆమె సర్టిఫికెట్ ఇచ్చింది. ‘‘నిన్నట్నుంచి నా భర్త మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవం. వాటి గురించి విని షాకయ్యా. గతంలో మేమిద్దరం విడాకులు తీసుకున్నట్లుగా ఊహాగానాలు పుట్టించారు. ఇవన్నీ మామూలే కదా అని ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణలు షాకిచ్చాయి. అందుకే ఇప్పుడు నా మౌనాన్ని వీడాలనుకుంటున్నాను. నవాజ్ ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. మా ఆయన ముస్లిం. నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. నవాజ్ నా గురించి అలా చేయించారన్న ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది’’ అని అంజలి చెప్పింది. మరి భార్యే సర్టిఫికెట్ ఇచ్చాక నవాజ్ మీద ఆరోపణలు ఏమాత్రం నిలబడతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English