ఆ చిన్న సినిమా నుంచి తేజు మూవీ టైటిల్

ఆ చిన్న సినిమా నుంచి తేజు మూవీ టైటిల్

బాగా పాపులర్ అయిన పాట పల్లవుల్లోంచి సినిమా టైటిళ్లు తీసుకోవడం కొత్తేమీ కాదు. ఐతే చాలా వరకు పెద్ద సినిమాల పాటల పల్లవులే టైటిళ్లు అవుతుంటాయి. కానీ ఇప్పుడో కొత్త సినిమాకు ఓ చిన్న సినిమాలోని పాట నుంచి టైటిల్ తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఆ చిన్న సినిమా ‘సిక్స్ టీన్స్’. అందులో ‘దేవుడు వరమందిస్తే’ అంటూ ఒక సూపర్ హిట్ పాట ఉన్న సంగతి తెలిసిందే. దీన్నే ఇప్పుడో కొత్త సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారట. ఆ చిత్రం సాయిధరమ్ తేజ్-కరుణాకరన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నదే. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట.

తేజు-కరుణాకరన్ సినిమాను నిర్మిస్తున్న సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తన ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బేనర్ మీద ఫిలిం ఛాంబర్లో ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. దీంతో తేజు సినిమాకే ఆ టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయిధరమ్.. కరుణాకరన్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై వాళ్లిద్దరూ చాలా ఆశలే పెట్టుకున్నారు.

ప్రేమ కథల స్పెషలిస్టు అయిన కరుణాకరన్.. ‘తొలి ప్రేమ’ స్టయిల్లో ఈ సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. టాకీ పార్ట్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో రిలీజ్ చేసే అవకాశముంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English