హీరోగా ఫెయిల్.. ఇక డైరెక్టరవుతాడట

హీరోగా ఫెయిల్.. ఇక డైరెక్టరవుతాడట

దాదాపు దశాబ్దంన్నర నుంచి నటుడిగా కొనసాగుతున్నాడు సాయిరాం శంకర్. కానీ ఇప్పటిదాకా నటుడిగా అతను క్లిక్ అవ్వలేదు. అన్న పూరి జగన్నాథ్ బ్యాకప్‌తో నటుడిగా అవకాశాలైతే చాలానే వచ్చాయి. స్వయంగా పూరినే తమ్ముడితో ఒక సినిమా తీశాడు. ఇంకో రెండు సినిమాలు నిర్మించాడు. బయటి బేనర్లలో కూడా అవకాశాలు ఇప్పించాడు. కానీ ఫలితం లేకపోయింది.

కొన్నేళ్లుగా సాయిరాం సినిమాలు వస్తున్నది వెళ్తున్నది కూడా తెలియట్లేదు. అయినా అతను ఆశ చంపుకోవట్లేదు. ప్రస్తుతం ‘వాడు నేను కాదు’ అనే సినిమాలో నటిస్తున్నాడతను. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ రూపొందుతోంది.

నటుడిగా ఇంకా సరైన బ్రేక్ అందుకోలేకపోయిన సాయిరాం ఇక దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడట. అన్నయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేసిన అనుభవమున్న సాయిరాం త్వరలోనే దర్శకుడిగా మారనున్నట్లు ప్రకటించాడు. డైరెక్టర్‌గా తన తొలి సినిమా కోసం స్క్రిప్టు రాస్తున్నానని.. ఇది ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కే సినిమా అని చెప్పాడు సాయిరాం శంకర్.

ఐతే దర్శకుడిగా మారినప్పటికీ నటుడిగా కొనసాగుతానని అతను ప్రకటించాడు. కానీ దర్శకుడిగా పూరి పరిస్థితే ఇప్పుడు అంతంతమాత్రంగా ఉంది. వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. మరి సాయిరాం వచ్చి ఏం సాధిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English