వెంకీతో ఓకే.. కానీ సునీల్‌తో ఎలా?

వెంకీతో ఓకే.. కానీ సునీల్‌తో ఎలా?

‘ఓం నమో వేంకటేశాయ’ చేస్తున్నపుడే అదే తన చివరి సినిమా అన్నట్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తమకు సంకేతాలిచ్చినట్లుగా వెల్లడించాడు అక్కినేని నాగార్జున. ఆ సినిమా బాగా ఆడి ఉంటే ఒక మధుర జ్ఞాపకంతో కెరీర్‌ను ముగించినట్లుగా ఫీలయ్యేవారేమో రాఘవేంద్రరావు.

‘ఓం నమో వేంకటేశాయ’ ఆయన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. సినిమా బాగానే తీసినా కొన్ని కారణాల వల్ల ఆడలేదు. ఆ తర్వాత సినిమాల విషయంలో ఒకింత వైరాగ్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. మళ్లీ మెగా ఫోన్ పట్టి తనేంటో రుజువు చేసుకోవాలన్న పట్టుదలతో రాఘవేంద్రరావు ఉన్నట్లు సమాచారం.

తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావే స్వయంగా ప్రకటించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను రెండు సినిమాలకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాఘవేంద్రరావు వెల్లడించడం విశేషం. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో పాటు కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ ప్రధాన పాత్రల్లో రెండు వేర్వేరు ఆధ్యాత్మిక చిత్రాలు చేయాలనే ఆలోచనలో తాను ఉన్నానని.. ఆ దిశగా వర్క్ కూడా జరుగుతోందని రాఘవేంద్రరావు తెలిపారు.

మరి ఆ కథలేంటో.. ఆ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తాయో ఆయన వెల్లడించలేదు. వెంకటేష్ తో సినిమా అంటే ఓకే కానీ.. సునీల్ ను పెట్టి ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమా తీసే పరిస్థితి ఉందా అన్నదే సందేహం. హీరోగా ప్రస్తుతం సునీల్ పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి దర్శకేంద్రుడి ఆలోచనేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు