చరణ్ లీగ్ మారే టైం వచ్చింది

చరణ్ లీగ్ మారే టైం వచ్చింది

టాలీవుడ్ లో కొత్త లీగ్ లను పరిచయం చేసిన హీరో రాంచరణ్. అప్పుడెప్పుడో అంటే 2009లోనే మగధీరతో ఇండస్ట్రీకి 80 కోట్ల మార్క్ చూపించేశాడు. అప్పటికి 50 కోట్లు అందుకోవడమే గగనం అనే పరిస్థితిలో.. చరణ్ సినిమా వసూళ్లు నభూతో అనిపించేశాయి. కానీ ఆ తర్వాత ఇప్పటివరకూ తన రికార్డును తానే బద్దలు కొట్టలేదు చరణ్.

మగధీర మినహాయిస్తే.. రాంచరణ్ కు టాప్ గ్రాసర్ ధృవ మాత్రమే. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు 55 కోట్లు షేర్. ఇదే చెర్రీ రీసెంట్ బెస్ట్. కానీ ఈ టైంలో పలువురు స్టార్లు చాలా దూరం వెళ్లిపోయారు. మహేష్ బాబు మూవీ శ్రీమంతుడు.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లు 80 కోట్ల షేర్ మార్క్ ను అందుకున్నాయి. జై లవకుశతో మరో 70 కోట్ల సినిమా అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్లబ్ లో రెండు సినిమాలు గల హీరో అల్లు అర్జున్. ఇలా ప్రతీ ఒక్కరు తమ తమ స్థాయిలను బాగా పెంచుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం 60 కోట్ల మార్క్ నే గత పదేళ్లలో చూడలేకపోయాడు.

అందుకే చరణ్ తన లీగ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది మెగా ఫ్యాన్స్ మాట. నిజానికి ఇది వాస్తవం కూడా. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్న రంగస్థలం.. చరణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 9 ఏళ్ల క్రితమే 2009లో రాంచరణ్ స్టామినా వంద.. మరి ఇప్పుడు చెర్రీ తన ఫుల్ పొటెన్షియల్ ను చూపిస్తే.. తిరిగి రికార్డులను రచ్చ రచ్చ చేసేయడం పెద్ద కష్టమేమీ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు