జపానోళ్లకు పిచ్చెక్కించేస్తోన్న బాహుబలి

జపానోళ్లకు పిచ్చెక్కించేస్తోన్న బాహుబలి

టాలీవుడ్ సినిమాగా మొదలై.. ఇండియా మొత్తాన్ని కిర్రెక్కించిన బాహుబలి.. సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి మొత్త ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసి.. విభ్రాంతి కలిగించే కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఆ సినిమా జపాన్ లో రిలీజ్ అయ్యి కొన్ని వారాలు గడిచింది. జపాన్ లో బాహుబలి2 సూపర్ హిట్ అంటూ తొలుత నిర్మాతలు చెప్పినపుడు మీడియా అంతగా పట్టించుకోలేదు.

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అసలు విషయం అప్పుడు అర్ధం కావడం మొదలైంది. పేపర్లలో కార్టూన్స్ రావడంతో మొదలుపెట్టిన హంగామా అంతకంతకూ పెరిగిపోతోంది. జపాన్ జనాలు బాహుబలి క్యారెక్టర్ వేషాల్లో సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నారంటే వారికి ఈ సినిమా ఎంతగా నచ్చేసిందో అర్ధమవుతుంది. ఇక వీళ్లకు మాత్రమే సొంతమైన టెక్నాలజీని కూడా బాహుబలి కోసం వాడేస్తున్నారు. కాఫీ కప్పుల్లో కూడా బాహుబలి.. భల్లాలదేవుడు.. శివగామి.. కట్టప్ప.. దేవసేన.. అవంతిక కనిపిస్తున్నారంటే.. జపాన్ లో బాహుబలి ఏ రేంజ్ లో క్లిక్ అయిందో తెలుసుకోవచ్చు. వాళ్లెంత రేంజులో వెర్రెత్తిపోతున్నారో ఈ కాఫీ ప్రింటింగ్ చూస్తే అర్ధమవుతుంది. అవును.. క్యాపుచునో కాఫీపై చాక్ లెట్ తో అలా ప్రింట్ చేయడానికి కూడా మిషన్స్ ఉన్నాయిలే.

ఇక కాఫీలే కాదు బాహుబలి కార్డ్ గేమ్ లు కూడా ఇప్పటికే హల్ చల్ చేసేస్తున్నాయి. ఇలాంటి బాహుబలి చిత్రాలు జపాన్ లో చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశంలో మిలియన్ డాలర్ వసూళ్లను దాటి దూసుకుపోతోంది బాహుబలి ది కంక్లూజన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English