హ్యాపీనెస్ పై ఉపాసన ప్రశ్నించింది

హ్యాపీనెస్ పై ఉపాసన ప్రశ్నించింది

మెగా పవర్ స్టార్ భార్యగా మాత్రమే కాదు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ప్లస్ ఫాలోయింగ్ ను ఉపాసన క్రియేట్ చేసుకుంటోంది. పేరొందిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ కావడం.. దీనికి రాంచరణ్ భార్య అనే ఇమేజ్ తోడవడంతో.. ఈమె చెప్పే మాటలకు బోలెడంత విలువ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సంగతులను వెతికి పట్టుకుని మరీ కొత్త యాంగిల్ లో చెప్పడంలో ఉపాసన స్పెషాలిటీయే వేరు.

రీసెంట్ గా ఉపాసన హ్యాపీనెస్ గురించి ఓ పోస్ట్ చేసింది. ఈ మధ్య ఓ డాక్టర్ ను కలిసిందట ఉపాసన. 1 నుంచి 10 వరకూ రేటింగ్ ఇస్తే.. ఎంత సంతోషంగా ఉన్నారని భావిస్తారు అని అడిగారట. ఇది చాలా సున్నితమైన ప్రశ్న అన్న ఉపాసన.. దీన్ని వ్యక్తిగత విషయంగా చెప్పుకొచ్చింది. అంతే కాదు.. అసలు ఇలాంటి ప్రశ్నను ఊహించనే లేదట. సమాధానం చెప్పడం క్లిష్టంగా అనిపించినా.. మొత్తానికి హ్యాపీనెస్ పై తన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. ఇవాళ తాను ఎంత సంతోషంగా ఉందో.. రాబోయే తన జీవితం అంతా అంతకంటే సంతోషంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పింది.

అంతే కాదు.. ఇలా సంతోషంగా ఉండడం అనే అంశంపై అందరూ దృష్టి సారించాలని చెప్పింది ఉపాసన. ఆనందంగా ఉండడమే ఆరోగ్యం అంటూ చక్కని మెసేజ్ ఇస్తూ.. ప్రతీ ఒక్కరు తమను తాము ఈ విషయంపై ప్రశ్నించుకోవాలని సూచించింది. ఆన్సర్ బైటకు చెప్పినా చెప్పకపోయినా.. ఎవరికి వారు తెలుసుకోవాలని మాత్రం చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు