సెక్సీనెస్ తో చంపేస్తున్న అక్కాచెల్లెళ్లు

సెక్సీనెస్ తో చంపేస్తున్న అక్కాచెల్లెళ్లు

మన ఫిలిం ఇండస్ట్రీలో వారసులు సిల్వర్ స్క్రీన్ పై మెరవడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పటివరకూ హీరోలు తప్ప.. హీరోయిన్స్ గా ఎవరూ సత్తా చాటలేదు. వచ్చినవారినే వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి. ఇక గ్లామర్ భామలు.. టాప్ హీరోయిన్ ఇలాంటి ట్యాగ్ ల వరకూ వెళ్లడం.. టాలీవుడ్ లో కనిపించదేమో అనుకున్నారంతా.

కానీ ఈ ట్రెండ్ కు బ్రేక్ పడబోతోందని అనుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు. సీనియర్ హీరో రాజశేఖర్.. మాజీ హీరోయిన్ జీవితల పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా  రూపొందుతున్న 2స్టేట్స్ రీమేక్ లో శివాని హీరోయిన్. రీసెంట్ గా ఓ నేటివ్ గ్లామర్ షూట్ చేసి భలేగా మెప్పించింది ఈ బ్యూటీ. శివాని చెల్లి శివాత్మిక కూడా తానేమీ తక్కువ కాదని అనిపించేసుకుంటోంది. పలు ఈవెంట్స్ కు గ్లామర్ డ్రెస్సులో హాజరు అవుతూ ఆశ్చర్య పరుస్తోంది.

స్టార్ వారసులు గతంలోనూ ఇండస్ట్రీలోకి వచ్చారు. నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్ గా నటించినా.. కొనసాగలేదు. కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవుదామని ప్రయత్నించి.. ఇప్పుడు దర్శకురాలిగా మారింది. రీసెంట్ గా మెగా డాటర్ నీహారిక హీరోయిన్ గా మారింది. కానీ గ్లామర్ కి దూరంగానే ఉంది. కానీ శివాని.. శివాత్మిక మాత్రం గ్లామర్ స్టేట్మెంట్ ను గట్టిగానే ఇస్తున్నారు. ఇది టాలీవుడ్ లో ఇప్పటివరకూ కనిపించని దృశ్యం.

తన కూతుళ్లను హీరోయిన్ లుగా.. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ గ్లామ్ డాల్స్ గా ప్రోత్సహిస్తున్న హీరో రాజశేఖర్ ను ఎంతగా ప్రశంసించినా తక్కువే. తనే స్వయంగా ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న రాజశేఖర్ కు.. ఆ ఫీల్డ్ పై  బోలెడంత గౌరవం ఉండడం సహజమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English