అన‌సూయ.. బిజీనా? అంతా గ్యాసేనా?

అన‌సూయ.. బిజీనా? అంతా గ్యాసేనా?

ఇప్పుడు తెలుగు టీవీలో పాపుల‌ర్ యాంక‌ర్ అన‌సూయే. చిట్టి పొట్టి డ్రెస్సుల‌తో... ఫేస్ ఎక్స్ ప్రెష‌న్స్‌తో... కెమెరాను బాగానే త‌న వైపు తిప్పుకుంది. ఆమె డ్రెస్సుల‌కు ప్రేక్ష‌కులు బాగానే ఫిదా అయ్యారు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యాక కూడా... అందాలు ఆర‌బోయ‌డానికి ఆమె ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. అందుకే బుల్లి తెర మీద నుంచి వెండితెర మీద‌కు కూడా జంప్ చేసింది. ఎప్పుడూ చూసినా... ఆమె చాలా బిజీ అని.. పెద్ద సినిమాల ఆఫ‌ర్ కూడా వ‌దులుకుంద‌ని వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అవి నిజంగానే న‌మ్మ‌చ్చా... లేక అంతా ప‌బ్లిసిటీ స్టంటా?

తాజాగా మ‌రొక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమెకు ఓ పెద్ద డైరెక్ట‌ర్ మంచి ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని, కానీ ఆమె ఒప్పుకోలేద‌ని టాక్. అయితే ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో... ఆ సినిమా ఏంటో మాత్రం అన‌సూయ ఎవ‌రితోనూ చెప్ప‌లేదు. కాబ‌ట్టి ఆ విష‌యం నిజ‌మ‌ని చెప్ప‌లేమూ... ఆమె ప‌బ్లిసిటీ కోసం కూడా ఇలాంటి విష‌యాలు స్ర్పెడ్ చేస్తుంద‌ని భావించేవారు ఉన్నారు. అంత పెద్ద ఆఫ‌ర్ ఆమెకు ఇవ్వ‌డానికి... అన‌సూయ ఇంత‌వ‌ర‌కు వెండితెర‌పై త‌న‌ను తాను నిరూపించుకోలేదు. ఫ‌ర్వాలేద‌నిపించే పెర్ఫార్మెన్స్ త‌ప్ప‌ సూప‌ర్ గా న‌టించింది అనే పాత్రే లేదు. అలాంట‌ప్పుడు ఆమెను వెతుక్కుంటూ పెద్ద డైరెక్ట‌ర్ వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్న కోణంలో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలోచిస్తే అది కూడా నిజ‌మే అనిపిస్తోంది కదూ!!

గ‌తంలో అన‌సూయ క్ష‌ణం సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. ఆ త‌రువాత గాయ‌త్రిలో కూడా చేసింది. సోగ్గాడే చిన్ని నాయ‌న, విన్న‌ర్ సినిమాల‌లో ఒక పాట‌లో క‌నిపించి మాయ‌మైంది. త్వ‌ర‌లో రాబోయే రంగ‌స్థ‌లం సినిమాలో కూడా అత్త పాత్ర చేస్తోంద‌ని అన్నారు. అలాగే స‌చ్చిందిరా గొర్రె సినిమాలో కూడా న‌టిస్తోంది. అలాగే ప‌లు టీవీ షోల‌కు వ్యాఖ్యాత‌గా న‌టిస్తోంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English