ఆ విషయంలో చిరుతో పోల్చుకున్న తేజు

ఆ విషయంలో చిరుతో పోల్చుకున్న తేజు

మెగాస్టార్ ని పవర్ స్టార్ ని తెగ ఇమిటేట్ చేసే మెగా హీరో సాయి ధరం తేజ్. తన మామయ్యలను గుర్తు చేసేలా నటించేదుకు అస్సలే మాత్రం సంకోచించడం. ఒక రకంగా అదే ఇతడికి అసెట్ అయినా.. మరో విధంగా డ్రాబ్యాక్ కూడా అవుతోంది. ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 5 డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నా.. ఆ విషయం బైటకు కనిపించకుండా ఉత్సాహంగానే షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

కానీ మనసులో ఉన్న ఫీలింగ్ ఎవరో ఒకరు కనిపిట్టేస్తారు కదా. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో ఇలాగే ఓ వ్యక్తి పలకరించాడట. మూవీ యూనిట్ లో ఎంతో కీలకమైన ఆ వ్యక్తి.. బాధపడకు భయ్యా అన్నాడట. దీనికి తేజు వచ్చిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. చిరంజీవి గారికి వరుసగా 10 సినిమాలు ఫ్లాపులు వచ్చాయి. అవన్నీ సహజం. ఇంకా కష్టపడతా. హిట్టొచ్చే వరకు శ్రమిస్తా. వచ్చాక ఇంకా శ్రమిస్తా.. అన్నాడట సాయి ధరం తేజ్.

ఈ మెగా హీరో కళ్లలో కనిపించిన కాన్ఫిడెన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం నటిస్తున్న కరుణాకరన్ మూవీతో మళ్లీ తాను హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయం అని గట్టి నమ్మకాలనే పెట్టుకున్నాడు సాయి ధరంతేజ్. వీటిని నిజం చేసేందుకు.. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తీయగల ట్యాలెంట్ ఉన్న కరుణాకరన్ కూడా అదే రీతిన కష్టపడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English