పోటీలోకి మర్డర్ల సినిమా కూడా

పోటీలోకి మర్డర్ల సినిమా కూడా

టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు థియేటర్లకు కూడా సినిమాల కొరత వెంటాడుతోంది.ఈ వారంలో ఏం మంత్రం వేశావే అనే ఒకే ఒక్క సినిమా వచ్చినా.. దీనికి థియేటర్లను నింపే సత్తా విషయంపై ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. అవే నిజమయ్యాయి. ఇప్పుడు రాబోయే వారం రిలీజ్ లపై అందరి దృష్టి పడింది.

కచ్చితంగా వారానికి ఒక సినిమా అయినా చూడాలని భావించే ప్రేక్షకుల కోసం సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. ఏకంగా మూడు చిత్రాలు మార్చ్ 16కు షెడ్యూల్ కాగా. వీటిలో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ ఒకటి. నయనతార డబ్బింగ్ మూవీ కర్తవ్యం కూడా ఇదే వారంలో  వస్తూండగా.. కోలీవుడ్ హిట్ మూవీ కావడంతో ఆసక్తి బాగానే ఉంది. వీటితో పాటు.. ఇప్పుడు దండుపాళ్యం3 అంటు మర్డర్ల బొమ్మ కూడా వచ్చేస్తోంది. మార్చ్ 16న విడుదల అంటూ పోస్టర్స్ కూడా విడుదల చేశారు.

ఇప్పటికే భయానక కంటెంట్ తో మొదటి రెండు చిత్రాలు ఆకట్టుకోగా.. ఇప్పుడు మూడో సినిమా విషయంలో మేకర్స్ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీజర్ ట్రైలర్ లతో ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో కంటెండ్ స్ట్రాంగ్ గానే ఉంటుందట. విడుదలకు ముందు అందుకున్న జజ్ అనుగుణంగా మూవీ కంటెంట్ ఉంటుందట. కిర్రాక్ పార్టీ.. కర్తవ్యంలతో పోటీగా విడుదల అయనా.. తమ చిత్రానికి తగిన ఆడియన్స్ ఉన్నారని అంటున్నారు మేకర్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English