సినిమాపై వున్న క్రేజ్‌ మొత్తం కిల్‌ అయింది

సినిమాపై వున్న క్రేజ్‌ మొత్తం కిల్‌ అయింది

బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని ఊపేస్తుందని అంచనా వేస్తోన్న 2.0 చిత్రంపై ఇంతకాలం చాలా అంచనాలుండేవి. ఏప్రిల్‌లోనే విడుదల అనేసరికి దానికి ఎదురు వెళ్లకూడదని మిగతా రీజనల్‌ చిత్రాల నిర్మాతలు కంగారు పడ్డారు. అయితే విడుదల వాయిదా పడడం, ఎప్పటికి రిలీజ్‌ అవుతుందనేది కూడా తెలియకపోవడం ఈ చిత్రంపై వున్న ఆసక్తిని చంపేసాయి.

అంతకుముందు వరకు ఈ చిత్రం గురించిన ఏ విశేషం గురించి అయినా ఎగబడిన జనం ఇప్పుడు 2.0 గురించి మాట్లాడుకోవడం లేదు. రజనీకాంత్‌ 'కాలా' చిత్రంపైకి దృష్టి మరలిపోవడంతో మళ్లీ 2.0పై బజ్‌ తీసుకురావడం కోసం శంకర్‌ స్ట్రాటజీ ప్లాన్‌ చేస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ అయితే ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదు. ఇంతకాలం పని చేసిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ సడన్‌గా బోర్డు తిప్పేయడంతో 2.0 పని మొదటికి వచ్చింది.

అంతర్జాతీయంగా వివిధ కంపెనీలకి ఈ వర్క్‌ విడివిడిగా అప్పగించారట. దసరా, దీపావళి టైమ్‌కి ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధమవుతుందని బయ్యర్లకి చెప్పారు కానీ అది వచ్చే సంక్రాంతి కూడా కావచ్చుననేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English