చరణ్‌ విశ్వరూపం చూస్తామట!

చరణ్‌ విశ్వరూపం చూస్తామట!

'రంగస్థలం' చిత్రంపై క్రేజ్‌ పాట, పాటకీ పెరిగిపోతోంది. తాజాగా విడుదలైన రంగమ్మ మంగమ్మ పాటకి మాస్‌నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఈ పాటలో, మొన్న విడుదలైన రంగ రంగ రంగస్థలాన పాటలోను చరణ్‌ డాన్సులు చాలా బాగా చేసాడని టాక్‌ వినిపిస్తోంది. ఇక ఇంకా విడుదల కాని ఐటెమ్‌ సాంగ్‌లో అయితే చరణ్‌ విశ్వరూపం చూస్తారట. తనకి బాగా నచ్చిన జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఆ పాట రూపొందించారు. ఈ పాటలో డిజె సుందరి పూజ హెగ్డే నర్తించింది. ఈ పాటకిగాను ఆమెకి భారీ పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.

రంగస్థలం చిత్రం ప్రయోగాత్మకంగా అనిపిస్తున్నా కానీ మాస్‌ మసాలా అంశాలు బాగా వుంటాయని, ఇది పూర్తి స్థాయి రివెంజ్‌ డ్రామా అని తెలిసింది. యాక్షన్‌ సన్నివేశాలు భారీ స్థాయిలో వుంటాయని, మాస్‌ ప్రేక్షకులని వెర్రెత్తించే రీతిలో మొదటి సారి సుకుమార్‌ దీనిని చాలా సర్‌ప్రైజింగ్‌గా మలిచినట్టు చెబుతున్నారు.

పతాక సన్నివేశాల్లో ఎమోషన్‌ పీక్స్‌లో వుంటుందని, ప్రథమార్ధం పూర్తి వినోదాత్మకంగా వుంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ చిత్రాన్ని ఎడిట్‌ చేసిన నవీన్‌ నూలి 'బ్లాక్‌బస్టర్‌ సిద్ధం' అంటూ ట్వీట్‌ చేయడంతో అభిమానుల్లో ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు