ఐతే.. అభిమాన సంఘం హర్టయ్యింది

ఐతే.. అభిమాన సంఘం హర్టయ్యింది

ఐతే అంటూ 2003లో వచ్చిన సినిమా ఓ సంచలనం. చంద్రశేఖర్ యేలేటి ట్యాలెంట్ ను చాటిచెప్పిన మూవీ. సినిమాలో పేరున్న నటీనటులు లేకున్నా.. కేవలం అంటే కేవలం కంటెంట్ తో కట్టిపడేసిన సినిమా ఐతే.  ఐతే 2.ఓ అంటూ ఓ సినిమా వస్తోందని కొంతకాలం క్రితం ప్రకటన వచ్చింది. టైటిల్ లుక్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇచ్చేశారు.

ఓ బ్యాంక్ సర్వర్ ను టార్గెట్ చేసి హ్యాకింగ్ చేయడం.. మూవీ థీమ్ అనే సంగతి చెప్పేశారు. ఐతే.. మేకింగ్ లో మాత్రం బోలెడంత ట్యాలెంట్ చూపించారు. ఐతే లో మాదిరిగానే  ఐదుగురు యంగ్ స్టర్స్.. ఓ కన్నింగ్ సీరియస్ విలన్ మధ్య జరిగే సైబర్ వార్ ఈ చిత్రం. అప్పట్లో డిఫరెంట్ సినిమాలకు మరీ విపరీతమైన ఆదరణ ఉండేది కాదు. అయినా సరే గుణ్నం గంగరాజు తీసిన ఐతే మాత్రం పెద్ద హిట్టయ్యింది. మరి ఆనాటి ఐతే మ్యాజిక్ ఈ 2 పాయింట్ జీరో రిపీట్ చేస్తుందా?

సినిమాలో చివరకు హీరో బ్యాచ్ కు బ్యాంక్ నిధులు దొరుకుతాయో లేదో కానీ.. ట్రైలర్లో మాత్రం ఆడియన్స్ కు కావల్సిన ఆసక్తికరమైన పాయింట్లు ఏమీ దొరకట్లేదు అనే చెప్పాలి. అసలు సినిమా మీద ఎక్సపెక్టేషన్లు పెరిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేయకపోవడంతో.. అప్పట్లో ఏర్పడిన 'ఐతే సినిమా అభిమాన సంఘం' సభ్యులు ఇప్పుడు హర్టవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు