వైఎస్సార్ బయోపిక్.. అన్నీ కల్పితాలే

వైఎస్సార్ బయోపిక్.. అన్నీ కల్పితాలే

సాధారణంగా రూమర్లకు ఒకప్పుడు కామాలు ఫుల్ స్టాపులు ఉండేవి. ఇప్పుడు మాత్రం అలాంటి కనిపించట్లేదు. అసలే డిజిటిల్ యుగం కాబట్టి.. పేజీలు పేజీలు విత్ అవుట్ పాజ్ చెక్కేస్తున్నారు జనాలు. అదిగో ఇప్పుడు అలాంటి కొన్ని చెక్కుళ్ళు తెలుగు సినిమా ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక ప్రక్కన నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ అనగానే.. ఇటు ప్రక్కన దివంత మహానేత 'వైఎస్సార్' బయోపిక్ అంటూ ఒక వార్త బయలుదేరింది. ఆ కథ ఎన్ని మలుపులు తిరుగుతోందో చూద్దాం పదండి.

నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారనగానే.. ఎలక్షన్లకు ముందు జనాలను మభ్యపెట్టడానికి బాలయ్య దగ్గరుండి తెలుగుదేశం పక్షపాతం వహించే కథను వండించారంటే ఇప్పిటికే వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు రూమర్లను షురూ చేశాయి. దానిని టాప్ నాచ్ రేంజులోకి తీసుకెళ్లడానికి.. అదిగో దర్శకుడు మహి ఆ మద్యన ఆనందోబ్రహ్మ సక్సెస్ ఆనందాన్ని పంచుకుంటూ.. వైఎస్ జీవితాన్ని సినిమాగా తీస్తాను అనడంతో.. వెంటనే అక్కడ వైఎస్సార్ బయోపిక్ అనే టాపిక్ మొదలైపోయింది. అయితే నిజానికి మహి క్యాంపులో ఎలాంటి కదలికలూ లేకపోయినా కూడా.. ఇప్పుడు ఈ సినిమాలో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో మెరవనున్నారు అంటూ ఒక రూమర్ పుట్టించారు. అది తెలుగువారిని బాగా బాధించింది. ఎందుకంటే తెలుగోళ్లకు ఎంతో చేసిన వెఎస్సార్ పాత్ర ఎవరో మలయాళం హీరో చెయ్యడమేంటి అనేది వారి ప్రశ్న.

అది అలా ఉంటే.. వైఎస్ ఎంత ఫ్యామస్సో ఆయన అనుచర వర్గాల్లో ఆ దివంగత నాయకుడి సతీమణి విజయమ్మ కూడా అంతే ఫ్యామస్. ఆమె కార్యకర్తలను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఆమె పాత్రను నయనతార చేస్తోంది అని చెప్పి ఇప్పుడు సదరు బయోపిక్ మీద కొందరు రూమర్లు పుట్టించారు. కాని విజయమ్మ వంటి వండర్‌ ఫుల్ క్యారక్టర్ ను అలాంటి ఒక గ్లామర్ డాళ్ హీరోయిన్ చేస్తోందంటే.. వైఎస్ నిజమైన అభిమానులకు కాస్త బాధగానే ఉంది. అయితే అలాంటి అభిమానుల కోసం చెప్పొచ్చేదేంటంటే.. అసలు ఈ బయోపిక్ లో మమ్ముట్టి అండ్ నయనతార అనేది జస్ట్ రూమరే. అవన్నీ కల్పితాలే. ఎలక్షన్లకు ముందు ఇలాంటి సినిమాలు వంటివి వద్దని ఆల్రెడీ వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారట. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు