ఇక అందరూ కలసి ఒక ఇంట్లోనే??

ఇక అందరూ కలసి ఒక ఇంట్లోనే??

శ్రీదేవి మ‌ర‌ణించాక బోనీ క‌పూర్ మాన‌సికంగా చాలా కుంగిపోయిన‌ట్టు క‌నిపించారు. ఇక శ్రీదేవి కూతుళ్లు ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌టివ‌ర‌కు ఉన్న కోప‌తాపాల్ని... ద్వేషాల్ని కూడా ప‌క్క‌న పెట్టి... తండ్రి ద‌గ్గ‌రికి వ‌చ్చారు అర్జున్ క‌పూర్‌... అన్షులా. బోనీ పెద్ద భార్య పిల్ల‌లు వీళ్లు. త‌మ తండ్రికి... చెల్లెళ్ల‌కు అండ‌గా ఉన్నారు. అర్జున్ క‌పూర్ తండ్రి వెంటే ఉంటూ సాయంగా ఉన్నాడు. బోనీకి ఇప్పుడు మిగిలింది న‌లుగురు పిల్ల‌లే. వారంతా త్వ‌ర‌లో ఒకే ఇంట్లో నివ‌సించే అవ‌కాశం ఉంది.

ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు అన్న అర్జున్ క‌పూర్‌. చెల్లి అన్షులాకు త‌న అవ‌స‌రం ఎంతుందో... జాన్వీ... ఖుషీల‌కు కూడా అంతే ఉంద‌ని అర్థం చేసుకున్నాడు. అందుకే వారికి ర‌క్ష‌ణ‌గా... తండ్రికి చేదోడుగా ఉండేందుకు చెల్లితో క‌లిసి తండ్రి ఇంటికే వెళ్ల బోతున్నాడ‌ని స‌మాచారం. మొద‌ట్నించి శ్రీదేవి అంటే అర్జున్ కు అస్స‌లు ప‌డ‌దు. త‌న త‌ల్లి స్థానాన్ని ఆమె లాక్కుంద‌ని కోపం. మీడియా ముందు కూడా చాలా సార్లు ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కాడు. కానీ శ్రీదేవి మ‌ర‌ణించింద‌న్న సంగ‌తి తెలిసి మాత్రం... ఒంట‌రిగా ఉన్న చెల్లి జాన్వీ ద‌గ్గ‌ర‌కు ప‌రిగెట్టాడు. ఆమెను ఓదార్చాడు. దుబాయ్ వెళ్లి తండ్రికి సాయంగా ఉన్నాడు.

ఇక అత‌ని చెల్లి అన్షులా.. జాన్వీని బాధ‌ను పొగొట్టేందుకు ఆమె 21వ పుట్టిన‌రోజును తానే ద‌గ్గ‌రుండి సెలెబ్రేట్ చేసింది. త‌న చెల్లెళ్ల గురించి ఎవ‌రైనా అస‌భ్యంగా మాట్లాడితే ఊరుకోన‌ని ట్విట్టర్‌లో వార్నింగ్ కూడా ఇచ్చింది. త‌ల్లి లేని ఈ న‌లుగురు పిల్ల‌లు క‌లిసి... తండ్రితో ఉండాల‌ని అనుకుంటున్నార‌ట‌. అర్జున్ ఆ ఇంటి పెద్ద కొడుకు కావ‌డంతో చెల్లెళ్ల బాధ్య‌త‌ను తానే తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లో వీరంతా క‌లిసి ఒకేచోట నివసించ‌బోతున్నార‌ని టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English