వామ్మో!! రోజుకో మెంట‌ల్ లుక్‌

వామ్మో!! రోజుకో మెంట‌ల్ లుక్‌

ఏక్తా క‌పూర్ కి నిజంగానే మెంట‌లా?... అదేంటీ ఇలా అనేశారు అనుకోకండి. ఆమె కొత్త సినిమాకు సంబందించి రోజుకో కొత్త లుక్ విడుద‌ల‌వుతూ... పిచ్చెక్కేలా చేస్తోంది. పోస్ట‌ర్లు ఇలా కూడా ఉంటాయా అనిపించేలా వెరైటీ లుక్‌ల‌ను విడుద‌ల చేస్తోంది. ఆ పోస్ట‌ర్ల‌లో ఉన్న హీరో హీరోయిన్లేమీ పోనీ చిన్నా చిత‌కా వాళ్లు కాదు. కంగ‌నా రనౌత్ వంటి సీనియ‌ర్ హీరోయిన్లున్నారు.ఏక్తా క‌పూర్ ప్రస్తుతం మెంటల్ హై క్యా సినిమా చేస్తోంది. ఇందులో కంగ‌నా ర‌నౌత్ తో పాటూ రాజ్‌కుమార్ రావు లీడ్ పాత్ర‌ల‌లో చేస్తున్నారు. సినిమా పేరుకు త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్ల‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు. కంగ‌నా ర‌నౌత్ పిచ్చి పిచ్చి ఫోజుల‌తో ఫోటోలు తీసి పోస్ట‌ర్లుగా మారుస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్ల త‌ల‌లు పేలుతున్న‌ట్టు పోస్ట‌ర్ విడుద‌ల చేసి... బాంబు పేలుడులాగా... భారీ మెంట‌ల్ పేలుడు అని క్యాప్ష‌న్ పెట్టి ట్విట్ట‌ర్లో విడుద‌ల చేశారు. మ‌రొక పోస్ట‌ర్లో కంగ‌నా మూతిని... క‌ళ్ల‌ను వెరైటీగా పెట్టించారు. అంద‌మైన కంగనాను ఇలా వెరైటీగా చూపించ‌డం కూడా కొత్త‌గానే ఉంది ప్రేక్ష‌కుల‌కు. కాక‌పోతే ఇంత పిచ్చి పోస్ట‌ర్ల‌ను క్రియేట్ చేస్తున్న ఏక్తా క‌పూర్ ఇంక ఏ స్థాయిలో పిచ్చి ఉందో అని కామెంట్లు చేసుకుంటున్నారు.ఈ సినిమాకు మ‌న‌కు కాస్త అనుబంధం ఉంది లెండి. ఎందుకంటే ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు కొడుకు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అలాగే అత‌ని భార్య క‌ణికా థిల్లాన్ ఈ సినిమాకు క‌థ రాసింది. ఈ సినిమాకు ఏక్తా క‌పూర్‌... శైలేష్ ఆర్ సింగ్ నిర్మాత‌గా  వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇది మెయిన్ గా ఇద్ద‌రి మ‌ధ్య సాగే క‌థ‌.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు