దిల్ రాజు దగ్గరుండి పెళ్ళి చేస్తున్నాడు

దిల్ రాజు దగ్గరుండి పెళ్ళి చేస్తున్నాడు

ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ తో జనాలను ఎంతలా కనెక్ట్ చేయవచ్చో నిర్మాత దిల్ రాజుకు బాగానే తెలుసు. అందుకే తన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారీయన. అంతే కాదు.. కొన్ని సినిమాలను అయితే పక్కాగా వారిని టార్గెట్ చేసే రూపొందిస్తారు కూడా. ఇప్పుడైతే పెళ్ళి అనే తంతును దగ్గరుండి జరిపింది.. అందరికీ చూపిస్తారట.

ఇప్పుడు నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం అనే చిత్రం రూపొందిస్తున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి అంటూ దిల్ రాజు నిర్మాతగా.. శర్వానంద్ హీరోగా ఈ దర్శకుడు భారీ బ్లాక్ బస్టర్ నే సాధించాడు. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం అంటూ నితిన్ తో చేస్తున్న సినిమా కూడా కుటుంబ కథా చిత్రమే అని టైటిల్ తోనే అర్ధం అవుతోంది. రాజమండ్రి సమీపంలో ఈ చిత్రం కోసం ఓ ఇంటి సెట్ ని వేశారు. ఇక్కడే షూటింగ్ సుదీర్ఘంగా జరుగుతుందట. కేవలం ఈ ఇంటికి సంబంధించిన సన్నివేశాలనే.. నెల రోజులకు పైగా షెడ్యూల్ చేశారంటే.. ఆ ఇంటికి ఈ సినిమాలో ఎంత రోల్ ఉందో అర్ధమవుతుంది.

ఇంతగా ఒకే ప్లేస్ లో షూటింగ్ ఎందుకు అంటే.. ఓ పెళ్లికి సంబంధించిన వేడుకలను చిత్రీకరించేందుకు అని తెలుస్తోంది. ఒక పెళ్లితో రెండు కుటుంబాలకు సంబంధించిన అనుబంధాలను ఫోకస్ చేస్తూ తీస్తున్న ఈ చిత్రంలో.. చాలానే ఎమోషన్స్ ఉంటాయట. అలా నెల రోజులకు పైగా ఓ పెళ్లి పండుగకు అన్ని ఏర్పాట్లు చేసిపెట్టారు దిల్ రాజు. అంటే 'వాటీజ్ మ్యారేజ్' అనే అంశంపై ఇది టాలీవుడ్ చరిత్రలో ఒక బైబిల్ తరహాలో మిగిలిపోయే సినిమా అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు