రాజమౌళి అక్కడే ఉంటాడంట

రాజమౌళి అక్కడే ఉంటాడంట

తెరవెనుకకే పరిమితం అవుతానని, నటుడిగా తెర మీదకి వచ్చి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసే ఆలోచన లేదని రాజమౌళి స్పష్టం చేశాడు. అడపాదడపా కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలు చేస్తున్నా కానీ, తన సినిమాలో ప్రతి సీన్‌ని నటులకి యాక్ట్‌ చేసి చూపించే అలవాటు ఉన్నా కానీ రాజమౌళి మాత్రం పూర్తిస్థాయి నటుడిగా తెర మీదకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.

దర్శకుడిగా తనపై ఉన్న బాధ్యతని, భారాన్ని మోయడానికే అతను అనునిత్యం శ్రమిస్తున్నాడు. 'బాహుబలి' చిత్రంలో రాజమౌళి కూడా నటించబోతున్నాడని, ఈ చిత్రంలో ప్రభాస్‌, రానాతో పాటు రాజమౌళి కూడా గడ్డంతో నటిస్తున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి.

కానీ తనకి ఆ ఆలోచన లేదని, ఆ గడ్డం ఫోటో ఎప్పుడో మూడేళ్ల క్రితంది అని రాజమౌళి స్పష్టం చేశాడు. అప్పుడు సరదాకి తన గడ్డం అలా పెంచడం జరిగిందని రాజమౌళి వివరణ ఇచ్చాడు. బాహుబలి చిత్రాన్ని తెలుగు చలన చిత్ర చరిత్రలో తలమానికంగా నిలిచిపోయేలా తీర్చిదిద్దడానికి రాజమౌళి పరితపిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు