రూమర్: అఖిల్ కు చెప్పిన కథేనట

రూమర్: అఖిల్ కు చెప్పిన కథేనట

రామ్ హీరోగా కొత్త సినిమా గురించిన కబుర్లు వచ్చేశాయి. టైటిల్ తో పాటు.. టైటిల్ లోగోను కూడా రివీల్ చేసేశారు. హలో గురూ ప్రేమకోసమే అంటూ.. ఓ క్యూట్ లవ్ స్టోరీతో అలరించనున్నాడు ఎనర్జిటిక్ హీరో. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

నేను లోకల్ తర్వాత.. ఇదే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా.. ఓ సినిమా వస్తుందని అన్నారు. అఖిల్ హీరోగా ఈ చిత్రం రూపొందుతుందనే టాక్ గట్టిగానే వినిపించింది. స్టోరీ డిస్కషన్స్ అవీ బాగానే నడిచాయ్ కానీ.. సినిమా మాత్రం ఫైనల్ కాలేదు. అప్పుడు ఆ సంగతులు పక్కకు వెళ్లిపోగా.. ఇప్పుడు రామ్ తో సినిమా గురించిన ప్రకటన వచ్చింది. అయితే.. అప్పుడు అఖిల్ కు చెప్పిన స్టోరీనే ఇప్పుడు రామ్ తో తీస్తున్నాడట నక్కిన త్రినాధరావు. ఎనర్జిటిక్ హీరోకు తగినట్లుగా.. సన్నివేశాల్లో కాసిన్ని మార్పులు చేశారట కానీ.. ఓవరాల్ గా స్టోరీ కాన్సెప్ట్ అంతా అదేనని అంటున్నారు.

విచిత్రం ఏంటంటే.. అప్పుడు కనుక అఖిల్ తో సినిమా ఖాయమైతే.. అనుపమనే హీరోయిన్ గా తీసుకుంటారని అన్నారు. ఇప్పుడు అదే భామను రామ్ కు జోడీగా ఫైనల్ చేశారు. పైగా హలో గురూ ప్రేమ కోసమే అనే టైటిల్ ను రిజిస్టర్ ను దిల్ రాజు.. అఖిల్ కోసమే రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడా టైటిల్ ను ఎనర్జిటిక్ హీరో కోసం ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ అఖిల్ కోసం రాసిన కథలోకే రామ్ వచ్చాడనే టాక్ కి బలం చేకూరుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English