సాయి పల్లవికి 13 లక్షలా? జస్ట్ సోదే

సాయి పల్లవికి 13 లక్షలా? జస్ట్ సోదే

ఇప్పుడు లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ సాయి ప‌ల్ల‌వి. ఆమె మేక‌ప్ లేకుండా న‌టిస్తున్నా కూడా యువ‌త ఆమె సినిమాల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఆమె హీరోల‌తో గొడ‌వ‌లు ప‌డుంతుందంటూ.. వారిని ఇరిటేట్ చేస్తుందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నా... ఆమె డేట్లు కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. చేసిన‌వి గుప్పెడు సినిమాలే అయినా.. ఆమె రేంజ్  ఆ స్థాయిలో ఉంది మ‌రి. అందుకే ఇప్పుడు ఆమెపై గాసిప్పులు కూడా అదే తరహాలో గుప్పుమంటున్నాయ్.

ఏకంగా రోజుకు ప‌ద‌మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌చ్చినా సాయి ప‌ల్ల‌వి నో చెప్పేసింద‌ని ఇప్పుడు ఒక గాసిప్ ప్రచారం చేస్తోంది. ఒక అమెరిక‌న్ సంస్థ కేవ‌లం ఒకే ఒక్క రోజు అమెరికాలో ఉంటే చాలు ప‌ద‌మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు పారితోషికంగా ఇస్తామ‌ని.. బిజినెస్ క్లాస్‌లో టిక్కెట్లు.. పెద్ద టెన్ స్టార్ హోటల్లో బస.. అంటూ ఆఫర్ చేశారని.. అది తిరస్కరించిందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది? నిజానికి ఇండియాలో గ్లామరసం బాగా దట్టించే హీరోయిన్లను.. అక్కడ తెలుగు సమాఖ్యలు ఇన్వయిట్ చేస్తుంటాయి. తమన్నా.. తాప్సీ.. కాజల్.. రకుల్.. రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు అక్కడికి వెళ్ళి.. డిన్నర్ ఈవెంట్లలో పాల్గొంటారు. తద్వారా ఆ సంస్థలు వీరితో కలిసి భోజనం చేయాలి అనుకునేవారి దగ్గర నుండి టిక్కెట్ వసూలు చేస్తారు. అలా బోలెడంత చారిటీ డబ్బులు పోగేస్తారు. అదొక వ్యాపకం. అయితే ఇలాంటి డిన్నర్లకు పిలిచేంత స్టార్డమ్ సాయి పల్లవికి ఉందా?

ఒక సినిమాను తన నటనతో రక్తి కట్టించే ఈ చిన్నది.. బయట మాత్రం ఫ్యాషన్ సెన్స్ లేకుండా అస్సలు ఏమాత్రం హీరోయిన్నే కాదు అన్నట్లు ఉంటుంది. అందుకే ఇలాంటి భామలకు అలాంటి డిన్నర్లకు రమ్మనేంత క్రేజ్ ఉండదు. నిత్యా మీనన్.. కలర్స్ స్వాతి.. వీరందరూ కూడా ఇదే బాపత్తు. కాబట్టి సాయిపల్లవికి ఆఫర్ వస్తే కాదంది అనడం.. జస్ట్ ఒక సోది న్యూస్ అనే అనుకోవాలి. అసలు ఆఫర్ వచ్చే ఛాన్సే లేదు అంటున్నారు అమెరికాలో ఇటువంటి డిన్నర్లు హోస్ట్ చేసే పెద్దలు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు