సెటప్ బాగుంది వైట్ల.. సెట్టింగ్ మార్చాలి

సెటప్ బాగుంది వైట్ల.. సెట్టింగ్ మార్చాలి

ఒక ప్రక్కన మాస్ రాజా హీరో. ఎన్ని ఫ్లాపులొచ్చినా కూడా కరక్టు కథ దొరికితే మాత్రం ఉతికి ఆరేస్తాడు. మరో ప్రక్కన హ్యాపెనింగ్ హీరోయిన్ అను ఎమ్మానుయేల్. అజ్ఞాతవాసి ఫ్లాపైనా కూడా ఈమె డేట్ల కోసం చాలామంది స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఇంకో ప్రక్కన మైత్రి మూవీస్. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలనే ప్రొడ్యూస్ చేస్తూ.. వరుసగా క్వాలిటీ టాప్ నాచ్ కంటెంట్ డెలివర్ చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళందరి గురించీ ఎందుకనేగా?

ఇప్పుడు మైత్రి మూవీస్ ప్రొడక్షన్లో.. రవితేజ హీరోగా అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా.. దర్శకుడు శ్రీను వైట్ల ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. పైగా సినిమాను అధిక భాగం అమెరికాలో షూటింగ్ చేస్తారట. ఈ సినిమాకు 'అమర్ అక్బర్ యాంటోని' అంటూ నామధేయం కూడా చేశారు. ఈరోజే ముహూర్తం కూడా కొట్టేశారు. మరి చూస్తుంటే సెటప్ చాలా బాగుంది అనిపించక మానదు. ఇంత మంచి సెటప్ ఉన్న తరువాత.. హిట్టు కొట్టాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా శ్రీను వైట్ల తన సెట్టింగ్ మార్చాలి. ఫారిన్ లో ఫస్టాఫ్‌ ఇక్కడ సెకండాఫ్‌ లో ఒక ఇంట్లోనో ఊళ్ళోనో కామెడీ.. వామ్మో.. చూసి చూసి చిర్రెత్తుకొస్తోంది. అందుకే కదా వరుసగా ఫ్లాపు స్ట్రోక్స్ తినేశాడు వైట్ల.

అందుకోసమే ఇప్పుడు తన కథ తాలూకు సెట్టింగ్.. పంచుల తాలూకు టైమింగ్.. కథనం తాలూకు లింకింగ్.. పూర్తి స్థాయిలో మార్చితేనే పనవుతుంది. ఇంత మంచి సెటప్ దొరికిన తరువాత కూడా మనోడు అవన్నీ మార్చకపోతే మాత్రం.. చాలా ఇబ్బందుల్లో పడిపోక తప్పదు. మరి మార్చాడనే ఇండస్ర్టీ అంతా నమ్ముతోంది. చాలామంది స్టార్లకు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల.. చివరకు ఫ్లాపులతో కెరియర్ చివరాంకంలో సతమతమైతే చూడలేం. అందుకే ఆయన్ను ఆడియన్స్ కూడా రూటు మార్చమని అడిగేది. వింటున్నారా సారూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English