ఇలా పోస్టర్ వచ్చింది.. అలా కాపీ అంటున్నారు

ఇలా పోస్టర్ వచ్చింది.. అలా కాపీ అంటున్నారు

సినిమా క‌థ‌లు కాపీ కొడుతున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే... మ‌రీ చీప్ గా సినిమా పోస్ట‌ర్లు కూడా కాపీ కొట్టేస్తారా?  కాస్త కొత్త‌గా ట్రై చేయ‌మ‌ని ప్రేక్ష‌కులు కోరుతుంటే... ఇలా కాపీ కొట్టి దించేస్తున్నారంటూ... ధ‌నుష్ మూవీ పోస్ట‌ర్ పై ఒక‌టే గుస‌గుస‌లు. గ‌తంలో విడుద‌లైన విజ‌య్ సినిమా పోస్ట‌ర్ నే కాపీ కొట్టి ధ‌నుష్ కొత్త సినిమా పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ధ‌నుష్ న‌టిస్తున్న సినిమా వ‌డా చెన్నై. గ‌త మూడేళ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూనే ఉంది. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ సినిమా పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. అందులో ఫుల్ మాస్ లుక్‌లో ఉన్న ధ‌నుష్ నోటిలో క‌త్తిని ప‌ట్టుకుని ఉన్నాడు. ఆ పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడో లేదో... నెటిజ‌న్లు కాపీ అంటూ స్పందించ‌డం ప్రారంభించారు. గ‌త ఏడాది విడుద‌లైన విజ‌య్ సినిమా మెర్సెల్ సినిమాలో కూడా హీరో నోటిలో క‌త్తితో హ‌ల్ చ‌ల్ చేస్తాడు. అదే పోస్ట‌ర్‌ను కాపీ కొట్టారంటూ నెటిజ‌న్లు విజ‌య్ పోస్ట‌ర్‌ను పోస్టు చేయ‌డం ప్రారంభించారు. ఎంతో ఆనందంగా ఇలా పోస్ట‌ర్ పోస్టు చేశాడో లేదో ధ‌నుష్‌... నిమిషాల్లో కాపీ అంటూ రీట్వీట్‌లు రావ‌డం... వ‌డా చెన్నై టీమ్ యూనిట్‌ను కాస్త క‌ల‌వ‌రానికి గురిచేసింది.

రెండు పోస్ట‌ర్ల‌లో క‌త్తి పెట్టుకోవ‌డం ఒక్క‌టే కామ‌న్‌. మిగ‌తాదంతా వేరుగా ఉంద‌ని వాదించేవాళ్లు ఉన్నారు. విజ‌య్ ప‌రుగులు పెడుతున్న‌ది ఒక పొలంలో అయితే.. ధ‌నుష్ తాడు ప‌ట్టుకుని ఏదో ఎత్తుమీద‌కి ఎక్కుతున్న‌ట్టు ఉంది. ఈ సినిమాలో ధ‌నుస్ క్యారెమ్స్ ఛాంపియ‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. జీవితంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న వల్ల క‌త్తి ప‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ట‌. మొత్త‌మ్మీద పోస్ట‌ర్ విడుద‌ల కాగానే... వ‌డా చెన్నైకు కాపీ అన్న మాట రావ‌డం కాస్త బాధ‌పెట్టేదే క‌దా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు