నయనతార.. మహేష్‌.. ఒకేలాంటి కథ

నయనతార.. మహేష్‌.. ఒకేలాంటి కథ

ఒక్కోసారి అనుకుని చేస్తారో అనుకోకుండా తీస్తారో తెలియదు కాని.. ఒకేసారి ఒకే రకంగా ఉన్న సినిమాలు భలే వచ్చేస్తుంటాయి. అయితే ఇప్పుడు గత సంవత్సరం వచ్చిన సినిమా ఒకటి.. అచ్చం పొలిటికల్ సిస్టం మీద పోరాటంలా ఉండటంతో.. అది 'భరత్ అను నేను' సినిమాకు దగ్గరగా ఉందా అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. పదండి అదేంటో చూద్దాం.

గతేడాది తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో 'ఆరమ్' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఒక ఐఎఎస్ ఆఫీసర్ గా నయనతార కనిపించింది. ఈ సినిమా మార్చి 16న 'కర్తవ్యం' అంటూ తెలుగులో విడుదలవుతోంది. అప్పట్లో విజయశాంతి కర్తవ్యం ఎంత హిట్టయ్యిందో.. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే హిట్టవుతుంది నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా టీజర్ చూస్తే  మాత్రం.. ప్రజల కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది 'భరత్ అను నేను' సినిమాలో మహేష్‌ ఒక తరహాలో చెబుతుంటే ఇక్కడ నయనతార ఇంకో తరహాలో చెబుతోంది అనిపిస్తోంది.

కొరటాల సినిమాలో మహేష్‌ ఒక ఎన్నిక కాబడిన రాజకీయ నాయకుడు అయితే.. ఇక్కడ నయనతార ఒక గవర్నమెంట్ సర్వెంట్. అంతే తేడా. ఆలోచనలూ ఆశయాలూ ఒకేలా కనిపిస్తున్నాయి. సర్లేండి.. ఈ దేశాన్ని మార్చాలంటూ ఇప్పటికి ఎన్నో సినిమాలొచ్చాయి. అదే 'అవినీతి' అనే పాయింట్ పై శంకర్ సార్ ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కాబట్టి.. లోపల కంటెంట్ ఎలా ప్రెజంట్ చేశారనేదే ముఖ్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు