ధనుష్ కలల సినిమా ఫస్ట్ లుక్

ధనుష్ కలల సినిమా ఫస్ట్ లుక్

తమిళంలో పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ధనుష్. కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడిగా అతడికి పేరు రావడం విశేషం. ధనుష్ కెరీర్ ఎదుగుదలలో అతడి అన్న సెల్వ రాఘవన్ తర్వాత అంతటి కీలక పాత్ర పోషించిన దర్శకుడు వెట్రిమారన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమా ‘పొల్లాదవన్’.. ‘ఆడుగళం’ ధనుష్ కెరీర్లో క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి. ‘ఆడుగళం’ సినిమాకు ధనుష్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ కాంబినేషన్లో ‘కాకా ముట్టై’.. ‘విసారణై’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు నిర్మించాడు ధనుష్.

తనకు అత్యంత ఆప్తుడైన వెట్రిమారన్ దర్శకత్వంలో చాలా విరామం తర్వాత నటిస్తున్నాడు ధనుష్. ఆ సినిమాను ‘వడ చెన్నై’. ఇది ధనుష్, వెట్రిమారన్‌ల డ్రీమ్ ప్రాజెక్టు. దీన్ని రెండు మూడు భాగాలుగా తీయాలన్నది ప్లాన్. తొలి వెర్షన్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ రోజే లాంచ్ చేశారు. ధనుస్ ఇందులో రౌడీ పాత్ర చేస్తున్నాడు. ఫస్ట్ లుక్‌లో అతను ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నైలో రౌడీయిజానికి కేంద్రమైన ఒక ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల నేపథ్యం కూడా రౌడీయిజమే. మరి ‘వడ చెన్నై’లో కొత్తగా ఏం చూపిస్తారో.. వీళ్లిద్దరి గత సినిమాల్లాగే ఇది కూడా క్లాసిక్ అవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు